ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థులు ఇష్టపడి చదవాలి

ABN, First Publish Date - 2022-12-31T00:11:22+05:30

విద్యార్థులు ఇష్టపడి చదవాలని, భావిభారత పౌరులుగా ఎదగాలని జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు.

విద్యార్థులకు నగదుబహుమతులు అందజేస్తున్న జడ్పీచైర్‌పర్సన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, డిసెంబరు 30: విద్యార్థులు ఇష్టపడి చదవాలని, భావిభారత పౌరులుగా ఎదగాలని జడ్పీచైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ అన్నారు. శుక్రవారం సిరిసిల్లలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌కళాశాలలో నిత్య జాతీయ పతాకావిష్కరణ 100వ రోజు సందర్భంగా పతాకావిష్కరణ చేశారు. అనంతరం జడ్పీచైర్‌పర్సన్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెదలాలని, తల్లిదండ్రులకు, గురువులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులపై ఉందని, ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యం అందించే లక్ష్యంతో పని చేస్తోందని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ కనకశ్రీ విజయరఘునందన్‌ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, ప్రతీ విద్యార్థి దేశభక్తి పెంపొందించుకోవాలని అన్నారు. జాతీయ పతాకం, జాతీయ గీతం గురించి తెలుసుకోవాలని, జాతీయ పతాకాన్ని గౌరవించాలని అన్నారు. ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు జడ్పీచైర్‌పర్సన్‌ను సన్మానించారు. అనంతరం ఇంటర్‌లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జడ్పీచైర్‌పర్సన్‌ నగదుబహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అధ్యాపకులు బుర్ర వెంకటేశంగౌడ్‌, ఇట్టినేని కనకయ్య, కచ్చు మేఘశ్యామ్‌, పెరుమాండ్ల రాజయ్య, నంబి అరుందతి, జంగిటి సురేష్‌, చెన్నోజ్వల శశిధర్‌, వాసరవేణి పర్శరాములు, దానవేని మహేందర్‌, అజ్మీర చంద్రశేఖర్‌, నీరటి విష్ణుప్రసాద్‌, మల్లేవేణి రవీందర్‌, కోడం శ్రీనివాస్‌, బదనపురం జ్యోతి, నాగారపు మహేష్‌, నవీన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:11:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising