ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యారంగ సమస్యలపై పోరాటం

ABN, First Publish Date - 2022-09-12T05:28:42+05:30

రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భగత్‌నగర్‌, సెప్టెంబరు 11: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని భారత విద్యార్థి ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు అన్నారు. ఆదివారం కోతిరాంపూర్‌లోని ముకుందలాల్‌ మిశ్రా భవన్‌లో జిల్లా కమిటీ సమావేశం రజనీకాంత్‌ అధ్యక్షతన జరిగింది. ఈసందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 14, 15, 16 తేదీల్లో కరీంనగర్‌లో జిల్లా కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ బహిరంగసభకు ఎస్‌ఎఫ్‌ఐ మాజీ ఆల్‌ ఇండియా కార్యదర్శి రాజ్య సభ సభ్యుడు శివదాసన్‌ హాజరవుతున్నారన్నారు. విద్యా రంగ సమస్యలు, భవిష్యత్‌ కార్యాచరణపై పోరాటాలకు సిద్ధమవుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. వసతి గృహాల్లో సరైన వసతులు లేక విద్యార్థులు నానాపాట్లు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల శ్రీకాంత్‌, శనిగరపు రజనీకాంత్‌, రాష్ట్ర కన్వినర్‌ మక్కపెళ్లి పూజ, నగరఅధ్యక్ష, కార్యదర్శులు రోహిత్‌, అరవింద్‌, జిల్లా కమిటీ నాయకులు రత్నం, సురేష్‌, మనోజ్‌, రమ్య,  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-12T05:28:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising