ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2022-01-20T06:29:42+05:30

జిల్లాలో కరో నా కేసులు పెరగకుండా ఉండేందుకు గాను పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరో నా కేసులు పెరగకుండా ఉండేందుకు గాను పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పు ల ఈశ్వర్‌ అన్నారు. బుధవా రం ఆయన జూమ్‌ ద్వారా జిల్లా అధికారులు, ప్రజాప్ర తినిధులతో వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడు తూ వంద శాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని సూచించారు. పెద్దపల్లి నియోజక వర్గంలోని జూలపల్లి, రాగినేడు, శ్రీరాంపూర్‌ పీహెచ్‌సీల పరిధిలో టీకాలను పెంచా లన్నారు. జిల్లాలో ఒమిక్రాన్‌ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న మందులు, హోం ఐసోలేషన్‌ కిట్ల వివరాలను పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. టీకాలు వేసుకోవడానికి వెనుకాడుతున్న వారికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలన్నారు. వ్యాక్సినేషన్‌లో జిల్లాను ముందుం చాలన్నారు. కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ 5,93,000 జనాభా లక్ష్యానికి గాను అందరికీ మొదటి డోస్‌ వేశామన్నారు. 4,26,000లక్షల మందికి రెండ వ డోస్‌ వేశామన్నారు. 15-18 ఏళ్ల మధ్య వయసుగల వారికి 56 శాతం వ్యాక్సిన్‌ వేశామన్నారు. ప్రతిరోజు జ్వర సర్వే చేపట్టి కరోనాను నియంత్రణలో ఉంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడు తూ నియోజకవర్గంలోని పలు పీహెచ్‌సీల్లో వ్యాక్సినేషన్‌ తక్కువగా ఉందని ఆ ప్రాంతాల్లో కలెక్టర్‌ సందర్శించి వైద్యాధికారుల సమన్వయంతో వెంటనే పూర్తిచేయా లన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో జడ్పీచైర్మన్‌ పుట్ట మధూకర్‌, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్‌, డీఎంహెచ్‌వో డాక్టర్‌ ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T06:29:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising