ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలు

ABN, First Publish Date - 2022-05-26T06:06:21+05:30

గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నా రు.

ఎలగందల్‌ గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌


కరీంనగర్‌ రూరల్‌, మే 25: గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ అన్నా రు. బుధవారం కొత్తపల్లి మండలంలోని ఎలగందల్‌, చింతకుంట గ్రామా ల్లో పర్యటించి మాట్లాడారు. చితకుంట గ్రామంలో ఎస్సారెస్పీ కాలువ వద్ద ప్రభుత్వ స్థలంలో ఖోఖో, కబడ్డీ మొదలగు ఆటలకు అనుకూలంగా ఉంటుందన్నారు. స్థలం సేకరణలో సమస్యలు తలెత్తకుండా ముందుగానే చూసుకోవాలన్నారు. ఎలగందల్‌లో పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. వనంలో ఎండిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలను నాటాలన్నారు. మొక్కలకు నీటిని సక్రమంగా అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ గరిమా అగర్వాల్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీని వాస్‌రెడ్డి, చితకుంట, ఎలగందల్‌ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-26T06:06:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising