ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి

ABN, First Publish Date - 2022-12-15T00:16:01+05:30

పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్‌ మంద మకరందు అన్నారు. ధర్మపురి పట్టణంలోని పలు వీధుల్లో బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. పారిశుధ్య పనులు, డంపింగ్‌ యార్డులు, గోదావరి నది పరిసరాలను, బస్తీ దవాఖానా కోసం స్థలాలను పరిశీ లించారు.

ధర్మపురి పట్టణంలో పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధర్మపురి, డిసెంబరు 14: పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని జగిత్యాల జిల్లా అదనపు (స్థానిక సంస్థలు) కలెక్టర్‌ మంద మకరందు అన్నారు. ధర్మపురి పట్టణంలోని పలు వీధుల్లో బుధవారం ఉదయం ఆయన పరిశీలించారు. పారిశుధ్య పనులు, డంపింగ్‌ యార్డులు, గోదావరి నది పరిసరాలను, బస్తీ దవాఖానా కోసం స్థలాలను పరిశీ లించారు. మున్సిపల్‌ పరిధిలో గల 2, 9, 10, 12, 13 వ వార్డుల్లో ఆయన తిరిగి పరసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. నిత్యం వార్డుల్లో చెత్తా చెదారం తొలగించి, మురికి కాలువలను శుభ్రం చేయించాలని ఆయన సూచించారు. గోదావరి స్నానాలకు వచ్చే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని స్నానఘట్టాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరొక సారి తాను వచ్చే వరకు పట్టణంలో ఎక్కడ కూడా పరిశుభ్రత లోపించకుండా చర్యలు తీసుకోవా లని అన్నారు. అనంతరం ఆయన మున్సిపల్‌ కార్యాలయాన్ని సందర్శిం చారు. మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది సంఖ్య గురించి అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైనేజీ నిర్మాణ పనుల ప్రగతి గురించి అడిగి తెలుసుకున్నారు. వేగవంతంగా పనులు పూర్తి అయ్యేలా ప్రజా ప్రతి నిధులు, మున్సిపల్‌ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ధర్మపురి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, వైస్‌చైర్మన్‌ ఇందారపు రామయ్య, మండల తహసీల్దార్‌ నలువాల వెంకటేష్‌, కౌన్సిలర్లు కొంపల పద్మ, గరిగె అరుణ, తిరుమన్‌దాసు అశోక్‌, మున్సిపల్‌ మేనేజర్‌ గంగాధర్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-15T00:16:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising