ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బహిరంగ ప్రదేశాల్లో పొగతాగితే జరిమానా

ABN, First Publish Date - 2022-06-01T06:14:19+05:30

బహిరంగ ప్రదేశాల్లో పొగతాగినా, పాన్‌, గుట్కాలు నమిలి ఉమ్మినా జరిమానా విధిస్తామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.

ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ రాహుల్‌హెగ్డే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల టౌన్‌, మే 31 : బహిరంగ ప్రదేశాల్లో పొగతాగినా, పాన్‌, గుట్కాలు నమిలి ఉమ్మినా జరిమానా విధిస్తామని ఎస్పీ రాహుల్‌ హెగ్డే అన్నారు.  ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవ గామన ర్యాలీ చేపట్టారు.  ఎస్పీ రాహుల్‌ హెగ్డే జెండాను ఊపి ర్యాలీని ప్రారం భించారు. అనంతరం జిల్లా ప్రధాన వైద్యశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఎస్పీ మాట్లాడారు. పొగతాగడం  మరణాలకు దారితీస్తుందన్నారు. పొగతాగే వారితోపాటు పక్కన ఉన్న వారికి హానికరమన్నారు. పొగతాగడం,  గుట్కాలు తినడంతో కేన్సర్‌ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు మాట్లాడుతూ సిగరెట్లు తాగడంతో నికోటిన్‌ అనే పదార్థం మెదడుకు చేరుకొని బ్రెయిన్‌ కేన్సర్‌కు దారితీస్తుందన్నారు. గొంతు, ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులు కూడా వస్తాయన్నారు. ి జిల్లా ప్రోగ్రాం, ఎన్‌సీడీ అధికారి డాక్టర్‌ మీనాక్షి మాట్లాడుతూ పొగతాగడం, గుట్కాలు తినడం  ఆరోగ్యానికి హానికరమన్నారు.  కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీరాములు, జిల్లా ప్రధాన వెద్యశాల సూపరింటెండెంట్‌ మురళీధర్‌రావు, సీహెచ్‌వో కృష్ణమూర్తి, పీఎంవో శ్రీనివాస్‌, సిబ్బంది సురేష్‌, లింగం, రాజ్‌కుమార్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-01T06:14:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising