ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2023 జూన్‌లోగా స్మార్ట్‌ పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-07-01T06:59:32+05:30

కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులను 2023 జూన్‌లోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, మేయర్‌ సునీల్‌రావు, సీపీ సత్యనారాయణ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ 

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 30: కరీంనగర్‌ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు పనులను 2023 జూన్‌లోగా అన్ని పనులను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. గురువారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో స్మార్ట్‌సిటీ బోర్డు జూమ్‌ మీటింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా  ప్రిన్సిపల్‌ సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. టవర్‌సర్కిల్‌ ఆధునీకరణ పనుల్లో జాప్యం చేస్తున్న ఏజెన్సీ కాంట్రాక్టర్‌పై మేయర్‌ సునీల్‌రావు ఫిర్యాదు చేశారు. దీనికి సెక్రెటరీ అరవింద్‌కుమార్‌ స్పందించి సదరు కాంట్రాక్టర్‌ను తొలగించి వేరొక కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలని సూచించారు. టవర్‌సర్కిల్‌ ఆధునీకరణలో అండర్‌గ్రౌండ్‌ పవర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌కు సంబంధించి అదనంగా తొమ్మిది కోట్లను మంజూరీ చేశారు. డిజిటల్‌ డోర్‌ నెంబర్‌ ప్రక్రియను వెంటనే ప్రారంభించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు. మేయర్‌ సునీల్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల మేరకు నగరంలో స్మార్ట్‌సిటీ పనులు పూర్తిచేస్తున్నామని చెప్పారు.  సమావేశంలో సీడీఎంఏ సత్యనారాయణ, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, సీపీ సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్‌ సేవా ఇస్లావత్‌, ఎస్‌ఈ నాగమల్లేశ్వర్‌రావు, ఈఈ కిష్టప్ప, మహేందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-01T06:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising