ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏసీడీపీ నిధులతో డివిజన్లలో స్వశక్తి భవనాలు

ABN, First Publish Date - 2022-08-04T05:48:34+05:30

స్వశక్తి మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం కోసం అవ సరమైన శిక్షణ ఇచ్చేందుకు డివిజన్‌కు రూ.5లక్షల ఏసీడీపీ నిధులతో డివిజన్లలో మ హిళా స్వశక్తి భవనాలు నిర్మించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

కోల్‌సిటీ, ఆగస్టు 3: స్వశక్తి మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చడం కోసం అవ సరమైన శిక్షణ ఇచ్చేందుకు డివిజన్‌కు రూ.5లక్షల ఏసీడీపీ నిధులతో డివిజన్లలో మ హిళా స్వశక్తి భవనాలు నిర్మించనున్నట్టు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. బుధవారం రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో మెప్మా ఆధ్వర్యంలో ధనశ్రీ పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావే శానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల జీవనోపాధికి కేటా యించిన నిధులతో కుట్టు, ఎంబ్రాయిడరీ మిషన్లు ఉచితంగా అందించడానికి జిల్లా కలెక్టర్‌ను సంప్రదిస్తామన్నారు. ఒక్కరికైతే కుట్టుమిషన్‌, గ్రూప్‌నకు అయితే ఎంబ్రా యిడరీ మిషన్‌ అందిస్తామని తెలిపారు. సమావేశాలు ఏర్పాటు చేసుకునే విధంగా డివిజన్లలో సమాఖ్యలు గదులను అద్దెకు తీసుకుంటే అద్దె కూడా చెల్లించేలా చర్య లు తీసుకుంటామన్నారు. మహిళా సమాఖ్యలు నిర్ణీత కాలానికి కార్యవర్గ కమిటీని ఎన్నుకోవాలని, రాజకీయాలకు అతీతంగా పనిచేసే వారికి ఇందులో స్థానం కల్పిస్తే బాగుంటుందన్నారు. ఈ సమావేశంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, కమిషనర్‌  సుమన్‌రావు, డిప్యూటీ మేయర్‌ అభిషేక్‌రావు, మెప్మా డీఎంసీ రజని, టీఎంసీ శ్వేత, కార్పొరేటర్‌ బాల రాజ్‌కుమార్‌, సీఓలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:48:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising