ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంక్షేమ పథకాలతో వికలాంగులకు భద్రత

ABN, First Publish Date - 2022-12-16T00:44:03+05:30

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వికలాంగులకు భద్రత కలుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు.

మెట్‌పల్లి సమావేశంలో మాట్లాడుతున్న కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు

మెట్‌పల్లి, డిసెంబరు 15 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వికలాంగులకు భద్రత కలుగుతుందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. గురువారం పట్టణంలోని మహాజన్‌ గార్డెన్స్‌లో జరిగిన వికలాంగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అథితిగా ఆయన పాల్గొన్నారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని వినతులను ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలోని వికలాంగులకు రూ. 3016ల పింఛన్‌, ఎకనామిక్‌ రిహాబీటిషన్‌ పథకం ద్వారా ఉపాధి కోసం రుణాలను అందజేస్తున్నామన్నారు. వికలాంగుల బస్సులో ప్రయాణించడానికి టికెట్‌లో సగం ధర పొందేలా పాసులను, ఉపకారణాల పథకంలో స్కూటీలు, బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశామన్నారు. వికలాంగులను పెళ్లి చేసుకుంటే కల్యాణ లక్ష్మితో పాటు అదనంగా రివార్డ్‌ కింద రూ. 1,25లక్షలు అందజేసి ప్రోత్సహిస్తామన్నారు. కోచింగ్‌ తీసుకునే బీసీ, ఎస్సీ వికలాంగుల విద్యార్థులకు సీఎం కేసీఆర్‌ ఉచితంగా కోచింగ్‌ అందజేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మీ సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొని వికలాంగులకు అన్నం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బోయినిపల్లి చంద్రశేఖర్‌రావు, నాయకులు, వికలాంగుల సంఘ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T00:44:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising