రెండో రోజూ కాంట్రాక్టు కార్మికుల నిరసన
ABN, First Publish Date - 2022-01-13T05:50:11+05:30
సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు బుధవారం కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
గోదావరిఖని, జనవరి 11: సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో రెండవ రోజు బుధవారం కాంట్రాక్టు కార్మికులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. స్థానిక సెక్టార్ 2, సివిల్ విభాగం, జీడీకే 3ఇంక్లైన్ ఆఫీస్ ఆవరణలో ఏఐటీయూసీ, బీఎంఎస్, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్, ఏఐసీటీయూ, ఏఐఎఫ్‌టీయూ, టీఎన్‌టీయూసీ, వైఎస్‌ఆర్‌టీపీ సంఘాల నాయకులు యాదగిరి సత్తయ్య, శనిగరపు చంద్రశేఖర్, ఎంఏ గౌస్, బైరం శంకర్, జీ రాములు, ఓఎల్ రెడ్డి నిమ్మకాయల ఏడు కొండలు, జీ రాములు, తోట వేణు, ఓఎల్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, గని ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్టు కార్మికుల సమస్య పరిష్కారానికి జీఎం, పర్సనల్ అధికారులతో ఒక విభాగం ఏర్పాటు చేయాలన్నారు. ఈ నిరసనలో జేఏసీ నాయకులు ఎండీ అబ్దుల్ కరీం, జనగామ రాయలింగు, నిమ్మకాయల ఏడుకొండలు, పాత నర్సింగరావు, ఎర్రం అంకిరెడ్డి, భూమయ్య, చిగురు లక్ష్మణ్ పాల్గొన్నారు.
Updated Date - 2022-01-13T05:50:11+05:30 IST