ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-05-19T06:01:28+05:30

ఉపాధ్యాయుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని ఉపాఽధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఉపాఽధ్యాయ సంఘాల పోరాట కమిటీ డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, మే 18: ఉపాధ్యాయుల ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్‌ వెంటనే విడుదల చేయాలని ఉపాఽధ్యాయ సంఘాల పోరాట కమిటీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం జిల్లా కేంద్రంలోని కరీంనగర్‌ రోడ్‌లోగల ఆచార్య జయశంకర్‌ విగ్రహం నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, కలెక్టరేట్‌ ఎదుట నిరసన ధర్నా చేపట్టి, అనంతరం అదనపు కలెక్టర్‌ లతను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేస్తామని ప్రకటించి రెండు నెలలు గడుస్తున్నా నేటివరకు షెడ్యూల్‌ విడుదలలో ఎలాంటి పురోగతి లేదన్నారు. నైరాశ్యంలో ఉన్న ఉపాధ్యాయులకు చేయూతనందించేందుకు బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ విడుదల చేయాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే జీవో నంబర్‌ 317 ప్రకారం ఉపాధ్యాయుల అప్పీళ్లను అన్నింటిని పరిష్కరించాలని పరస్పర బదిలీల ఉత్తర్వులు సీనియారిటీ రక్షణతో ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో యూఎస్‌పీసీ నాయకులు అడ్లగట్ల గంగాధర్‌, చంద్రమౌళి, తిరుకోవెల శ్యాంసుందర్‌, బోగ రమేష్‌, ఎన్నం రాంరెడ్డి, మహేష్‌గౌడ్‌, మహేష్‌, రాంచంద్రం, నరేంధర్‌, మానుపాటి బన్న, ఎడ్ల గోవర్ధన్‌, బాలె గంగాధర్‌, వేముల సుధాకర్‌, రవీంధర్‌, ప్రసాద్‌, రవీంధర్‌రెడ్డి, ఫక్రోద్దీన్‌, శ్రీధర్‌, శశిధర్‌, రవీంధర్‌, రాంకుమార్‌, బోగ శ్రీనివాస్‌, రాజేష్‌, మనోహర్‌, రాజేంధర్‌, గజ్జెల లచ్చయ్య, మోటూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:01:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising