ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయాలి

ABN, First Publish Date - 2022-12-16T23:56:59+05:30

రాష్ట్రంలో 20లక్షల కౌలు రైతులున్నా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

శంకరపట్నంలో మాట్లాడుతున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శంకరపట్నం, డిసెంబరు 16: రాష్ట్రంలో 20లక్షల కౌలు రైతులున్నా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కౌలు రైతులకు రైతుబంధు వర్తింపజేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కేశవపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్‌ అసమర్థ, బీజేపీ దోడిడీ పాలనలో తెలంగాణ సమాజం దుఃఖంలో ఉందన్నారు. శంకరపట్నం మండలంలో స్థానిక ఎమ్మెల్యే రసమయి ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేశారన్నారు. వంద పడకల ఆస్పత్రి, ఒక జూనియర్‌ కళాశాల ఏర్పాటు కాగితాలకే పరిమితమయ్యాయన్నారు. రైతుబంధు కేవలం భూస్వామ్య బంధుగా మారిందని, మక్తలో 250మంది ఓటర్లు ఉండగా, అక్కడ ఒక భూస్వామికి 200ఎకరాలు ఉందని, అతనికి సీజన్‌కు రూ. 10లక్షలు రైతుబంధు పడుతుందని, ఊరందరికీ కలిసి రెండు లక్షలు మాత్రమే పడుతుందన్నారు. తెలంగాణలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అన్నారు. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ వార్‌ రూంపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించారు. లిక్కర్‌ కేసులో సీబీఐ పిటిషన్‌ను కోర్టు విచారణకు అంగీకరించడాన్ని స్వాగతించారు. వందల కోట్లతో ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్‌ చేస్తూ, పేదల డబ్బుతో ఢిల్లీలో కార్యాలయాలు కడుతున్నారని మండిపడ్డారు. దళితబంధును ఎమ్మెల్యే అనుచరులు, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు ఇస్తున్నారన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల గురించి ఎవరూ మాట్లాడరన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌ ప్రతి సంవత్సరం ప్రకటించకుండా కేవలం ఎన్నికల కోసమే నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు ఇస్తున్నారన్నారు. బీసీ, ఎస్సీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. మొలంగూర్‌ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు. తాడికల్‌ గ్రామంలో బుడగ జంగాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. ఇప్పటికీ వాళ్లు ప్లాస్టిక్‌ కవర్లు, చీరలు అడ్డుగా కట్టుకొని నివసిస్తున్నారన్నారు. గ్రామాన్ని దత్తత తీసుకుం టానని చెప్పిన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ గ్రామాన్ని పట్టించుకోకుండా కనీసం గ్రామంలోని పేదలకు ఇళ్లు కూడా కట్టివ్వకుండా విఫలమయ్యారని విమర్శించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిశాని రామచంద్రం, రాష్ట్ర కమిటీ సభ్యుడు జక్కని సంజయ్‌, రాష్ట్ర మహిళా కన్వీనర్‌ శిరీష, మహిళా జోనల్‌ కన్వీనర్‌ స్వరూప, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, జిల్లా ఇన్‌చార్జీ అశోక్‌, నియోజక వర్గ అధ్యక్షుడు ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:57:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising