ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ బస్సు-లారీ ఢీ: ఒకరి మృతి

ABN, First Publish Date - 2022-08-04T06:31:11+05:30

మండలంలోని రాజారం స్టేజీ సమీపంలో బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు-లారీ ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా బస్సులోని ముగ్గురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు.

ఢీకొన్న ఆర్టీసీ బస్సు, లారీ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- 20మంది ప్రయాణికులకు గాయాలు 

- ముగ్గురి పరిస్థితి విషమం

మల్యాల, ఆగస్టు 3: మండలంలోని రాజారం స్టేజీ సమీపంలో బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సు-లారీ ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా బస్సులోని ముగ్గురు ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. జగిత్యాలకు చెందిన దాదాపుగా 20మంది తిరుపతికి వెళ్లి తిరిగి వస్తూ వరంగల్‌లో జగిత్యాల డిపో బస్సు ఎక్కారు. రాజారం సమీపానికి చేరుకోగానే ఎదు రుగా వస్తున్న లారీ ఢీకొంది. దీంతో బస్సులోని ముత్తవ్వ(65)అనే వృద్ధురాలు అక్కడిక్కడే మృతి చెందగా బస్సు డ్రైవర్‌ స్టీరింగ్‌, క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. లారీ డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బస్సులో 30మందికి పైగా ప్రయాణికులు ఉండగా ఈ ప్రమాదంలో కండక్టర్‌తో పాటు దాదాపుగా 20 మంది వరకు గాయపడ్డట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని చిక్సిత్స కోసం జగిత్యాలకు తరలించారు. ప్రమాదంతో రహదారికిరువైపులా కిలోమీటర్ల కొద్ది వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్‌, సీఐ రమణామూర్తి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.  

Updated Date - 2022-08-04T06:31:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising