ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టండి

ABN, First Publish Date - 2022-05-23T06:05:27+05:30

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్య తిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు అన్నారు.

మాట్లాడుతున్న జేవీ చలపతిరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళ్యాణ్‌నగర్‌, మే 22: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్య తిరేక విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జేవీ చలపతిరావు అన్నారు. ఆదివారం గాంధీనగర్‌లో జరిగిన న్యూడెమోక్రసీ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎనిమిది సంవత్సరాల్లో ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పెట్టుబడిదారులకు అమ్ముతుందని, కార్పొరేట్‌ శక్తులకు రెడ్‌ కార్పేట్‌ పరుస్తుందని ఆరోపించారు. నిత్యావసర ఽవస్తువుల ధరల పెంపుతో సామాన్యులు విలవిలలాడుతున్నారని, పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్‌ చేశారు. న్యూడెమోక్రసీ పార్టీ నుంచి కొంత మంది వెళ్లిపోయి ప్రజాపంథ పార్టీలోకి వెళ్లినప్పటికీ వారు మళ్లీ తిరిగి ఐఎఫ్‌టీయూలోకి రావడం సంతోషకరమన్నారు. న్యూడెమోక్రసీ నుంచి ప్రజా పంథాలోకి వెళ్లిన జిల్లా కన్వీనర్‌ వెంకన్నకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో న్యూడెమోక్రసీ నాయకులు కే రాజన్న, ఈదునూరి నరేష్‌, ఐ కృష్ణ, భూమేశ్వర్‌, రమేష్‌, అశోక్‌, వెంకన్న, బుచ్చయ్య, లక్ష్మి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-23T06:05:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising