కలెక్టరేట్‌కు తరలివచ్చిన బండలింగాపూర్ వాసులు
ABN, First Publish Date - 2022-08-05T05:45:44+05:30
జిల్లాలోని మెట్‌పల్లి మండలం బం డలింగాపూర్ గ్రామ వాసులు గురువారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు.
తమ గ్రామాన్ని మండలంగా చేయాలని వినతి
జగిత్యాల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మెట్‌పల్లి మండలం బం డలింగాపూర్ గ్రామ వాసులు గురువారం కలెక్టరేట్‌కు తరలివచ్చారు. ప్ర భుత్వం నిర్వహిస్తున్న పునర్విభజనలో భాగంగా బండలింగాపూర్ కేంద్రం గా మండలాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాలకు వచ్చా రు. పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ బీఎస్ లతను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిజాం కాలంలో సంస్థానంగా వర్ధిల్లిన బండలింగాపూర్‌ను మండల కేంద్రంగా ప్రకటించి గ్రామానికి పూర్వవైభ వం తీసుకొని రావాలని కోరారు. మండల కేంద్రంగా బండలింగాపూర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ గతంలో 45 రోజులు రిలే నిరాహారదీక్షలు సైతం నిర్వహించామని గుర్తుచేశారు. మండల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థలాలు, భవనాలు సైతం గ్రామంలో ఉన్నాయ ని విన్నవించారు. ఈకార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పలు వురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-05T05:45:44+05:30 IST