ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒబులాపూర్‌లో గ్రామస్థుల రాస్తారోకో

ABN, First Publish Date - 2022-01-24T06:43:26+05:30

ఒబులాపూర్‌ గ్రామానికి చెందిన అటవీ భూములు దురాక్రమణకు గురవుతున్నాయని అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ప్రధాన రహదారి పై గ్రామస్థులు గంట పాటు రాస్తారోకో జరిపారు.

ఒబులాపూర్‌లో ధర్నా,రాస్తారోకో చేస్తున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అటవీ భూములు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌

మల్లాపూర్‌, జనవరి 23 : ఒబులాపూర్‌ గ్రామానికి చెందిన అటవీ భూములు దురాక్రమణకు గురవుతున్నాయని అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ప్రధాన రహదారి పై గ్రామస్థులు గంట పాటు రాస్తారోకో జరిపారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రెవెన్యు, పోలీస్‌ అధికారులు సిబ్బందితో ఒబులాపూర్‌ గ్రామానికి చేరుకుని సమస్యను తెలుసుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల మేరకు ఒబులాపూర్‌ శివారులో గల కొన్ని భూములు పునరావాస గ్రామాలైన రత్నాపూర్‌, కుస్తాపూర్‌కు కేటాయించారు. కేటాయించిన భూముల పట్టాదారులు కొన్నేండ్లుగా సాగు చేసుకోలేదు. ఇటీవల భూములను పట్టాదారులు చదును చేసే ప్రయత్నం చేయగా ఒబులాపూర్‌ గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇందులో భాగంగా ఒబులాపూర్‌ గ్రామస్థులు తమ గ్రామానికి చెందిన అటవీ భూములను అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రోడ్డెక్కారు. సదరు భూములను సంబంధిత అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉందని కోరారు. సమస్య ముదరక ముందే చర్యలు తీసుకుంటే పునరావాస గ్రామాల సమస్య తీరనుందని మండల ప్రజలు పేర్కొంటున్నారు. భూములను పరిశీలిస్తామని హామీ మేరకు గ్రామస్థులు ఆందోళనను విరమించారు. 


Updated Date - 2022-01-24T06:43:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising