ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుద్రంగిలో రైతుల రాస్తారోకో

ABN, First Publish Date - 2022-06-12T05:38:50+05:30

కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని వేగంగా తూకం వేయాలని డిమాండ్‌ చేస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు.

కోరుట్ల - వేములవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రంగి జూన్‌ 11:  కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యాన్ని వేగంగా తూకం వేయాలని డిమాండ్‌ చేస్తూ రుద్రంగి మండల కేంద్రంలోని వేములవాడ-కోరుట్ల ప్రధాన రహదారిపై శనివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రుద్రంగిలోని మార్కెట్‌ యార్డు, సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోనుగోలు కేంద్రాల్లో  హమాలీ సంఘం  రెండు గ్రూపులుగా తూకం వేస్తున్నట్లు  తెలిపారు.  మార్కెట్‌ యార్డులో కొనుగోల్లు పూర్తి కావడంతో అక్కడి గ్రూపు హమాలీలు ఖాళీగా ఉన్నారని, సింగిల్‌ విండో కొనుగోలు కేంద్రంల్లో ఉన్న ధాన్యాన్ని రెండు గ్రూపుల హమాలీలు తూకం వేస్తే తొందరగా కొనుగోళ్లు  పూర్తి అవుతాయన్నారు.  రాస్తారోకో విషయం తెలుసుకున్న జడ్పీటీసీ గట్ల మీనయ్య,  పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కొనుగోళ్లను వేగవంతంగా చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు రాస్తారోకో విరమించారు. రైతులు ఒద్యారపు రమేష్‌, గంధం మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-06-12T05:38:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising