ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి

ABN, First Publish Date - 2022-09-27T06:08:10+05:30

ప్రజావాణి కార్యక్రమం లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు.

ధరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల కలెక్టర్‌ రవి 

జగిత్యాల టౌన్‌, సెప్టెంబరు 26: ప్రజావాణి కార్యక్రమం లో ప్రజల నుంచి వచ్చిన సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ రవి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిం చారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై  కలెక్టర్‌కు 25 వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ధరఖాస్తును తక్షణమే పరిష్కరిం చాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీ,  వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు. 

స్వఛ్చ సర్వేక్షన్‌ గ్రామీణ భారత్‌లో దేశంలోనే జగిత్యాల జిల్లాకు రెండవ ర్యాంకు సాధించిన సందర్భంగా సోమ వారం వివిధ శాఖల అధికారులు జిల్లా కలెక్టర్‌ రవి నాయక్‌ను కలిసి పుష్పగుచ్చాలు అందించి షాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు. 

 ఫ పెండింగ్‌ పనులను అధికారులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పట్టణంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి పలు ప్రభుత్వ శాఖల అధికారులతో హరితహారం, ఈజీఎస్‌, దళితబంధు తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తొల గించిన మొక్కల స్థానంలో కొత్తవాటిని నాటాలన్నారు. మొక్కలకు జియోట్యాగింగ్‌ చేయాలన్నారు. ఈజీఎస్‌ పను లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. రిజిస్టర్లు తనిఖీ చేయాలని, పెండింగ్‌ పనులు లేకుండా జాగ్రత్తలు వహించాలన్నారు. దళితబంధు లబ్ధిదారుల జాబితాను వేగవంతంగా పూర్తి చేసి వెరిఫికేషన్లు చేయాలన్నారు. వైకంఠదామం వైపు వెళ్లే రోడ్డు గుంతలు లేకుండా సరిచే యించాలన్నారు. ప్రజావాణిలో వచ్చిన సమస్యలను పెం డింగ్‌లో ఉంచకుండా వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు.   

Updated Date - 2022-09-27T06:08:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising