ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారుణ్య నియామక పత్రాలు అందజేత

ABN, First Publish Date - 2022-01-23T06:00:36+05:30

మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, చనిపోయిన ఉద్యోగుల వారసులకు 42మందికి కారుణ్య నియామకాల ఉత్తర్వులను శనివారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అందజేశారు.

కారుణ్య నియామక పత్రాలు అందజేస్తున్న జీఎం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదావరిఖని, జనవరి 22: మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌, చనిపోయిన ఉద్యోగుల వారసులకు 42మందికి కారుణ్య నియామకాల ఉత్తర్వులను శనివారం ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎండీ శ్రీధర్‌ చొరవతో త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతుందని, మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారికి  వెంటనే అన్‌ఫిట్‌ చేయడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని, 42మందిలో ఆరుగులు మహిళలు ఉన్నారని, వీరికి త్వరలోనేఆర్‌జీ-1  ఏరియాలో పోస్టింగ్‌ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఆర్‌జీ-1 పరిధిలోని ఇప్పటి వరకు 1327 మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ కాగా అందులో 1026మందికి ఉత్తర్వులు అందించడం జరిగిందని, అదే విధంగా వంద మందికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ రూ25లక్షల చొప్పున, 9మందికి ఎంఎంపీ నెలకు రూ.25వేల చొప్పున చెల్లించడం జరుగుతుందని తెలిపారు. నూతనంగా ఉద్యోగాలు పొందిన యువకులు సీనియర్ల వద్ద పని మెళుకువలు నేర్చుకుని సంస్థ పురోభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఎంఓఏఐ ప్రతినిధి తిరుపతిరెడ్డి, పర్సనల్‌ అధికారులు శ్రావణ్‌, నరేన్‌, చక్రవర్తి, సీనియర్‌ పీఓ సారంగపాణి, మల్లీశ్వరి, వీరారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-01-23T06:00:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising