ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో నిరసన

ABN, First Publish Date - 2022-05-19T06:24:55+05:30

ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎల్లారెడ్డిపేట, మే 18: ప్రభుత్వం గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని బీజేపీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.  అధికారంలో వస్తే గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో  టీఆర్‌ఎస్‌ ప్రకటించిందని,  నేటికీ అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఇచ్చిన హామీని నెరవేర్చలేని సీఎం కేసీఆర్‌ గిరిజనులకు అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రిజర్వేషన్‌ కల్పించాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం తహసీల్‌ అధికారులకు వినతి పత్రం అందజేశారు.  వినతి పత్రం జిరాక్స్‌ ప్రతిపై తహసీల్దార్‌ స్టాంపు వేసి అటెండర్‌ సంతకం చేసి ఇవ్వడంతో నాయకులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు అందుబాటులో ఉండగా అటెండర్‌ ఎలా సంతకం చేసి ఇస్తారని ప్రశ్నించారు.  దీంతో ప్రభుత్వ కార్యాలయాల్లోనూ అధికారులు నిబంధనలు పాటించడం లేదని మండి పడ్డారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రజిత, నాయకులు రవీందర్‌నాయక్‌, తిరుపతిరెడ్డి, సాయిలు, సాయికిరణ్‌, అనిల్‌నాయక్‌, నర్సింలు, రవి, కృష్ణహరి, శ్రీకాంత్‌, జితేందర్‌రెడ్డి, కార్తీక్‌రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-19T06:24:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising