ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోన్నతులు, బదిలీ షెడ్యూల్‌ విడుదల చేయాలి

ABN, First Publish Date - 2022-05-19T05:54:03+05:30

ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ఎం రఘుశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ఎం రఘుశంకర్‌ రెడ్డి

సుభాష్‌నగర్‌, మే 18: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీ షెడ్యూల్‌ను వెంటనే విడుదల చేయాలని యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ఎం రఘుశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. యూఎస్‌పీసీ రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ పిలుపు మేరకు  కలెక్టరేట్‌ ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్న తుల షెడ్యూల్‌ విడుదల చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారని అన్నారు. ఏడేళ్లుగా పదోన్నతులు లేక విద్యా రంగం పూర్తిగా నిర్వీర్యమవుతున్నప్పటికి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు నష్టపోతున్నా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా పదోన్నతులు కల్పిస్తామని ప్రకటనలు చేసినా షెడ్యూల్‌ విడుదల చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలు చేస్తామని ప్రకటించినప్పటికి నేటికి అవి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. కార్యక్రమంలో యూఎస్‌పీసీ రాష్ట్ర బాధ్యులు గోల్కొండ శ్రీధర్‌, కె కిషన్‌రావు, మాడుగుల రాములు, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు ఎం కుమార్‌, పోరెడ్డి దామోదర్‌రెడ్డి, గడ్డం సత్యనారాయణరెడ్డి, ఆర్‌ చంద్రశేఖర్‌, ఎండీ ఖలీలుద్దీన్‌, కె నర్సయ్యగౌడ్‌, తూముల తిరుపతి, ఎం బాలరాజు, ఎస్‌ వేణు, బి సురేశ్‌, వి బాలయ్య, ఏ దామోదర్‌, ఎన్‌ బాలయ్య, సీహెచ్‌ రాంమోహన్‌, శశిధర్‌, కె కిషన్‌ రెడ్డి, ఎం రామయ్య, టి తిరుపతి, సీహెచ్‌ రాజేశ్వర్‌ రెడ్డి, వి రాంకిరణ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T05:54:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising