జిల్లా స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తాచాటిన క్రీడాకారులు
ABN, First Publish Date - 2022-10-17T05:45:02+05:30
రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణం మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్‌లో క్రీడాకారులు సత్తా చాటారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ పోటీలను ప్రారంభించారు.
పరుగు పందెలో బాలికలు
- సిరిసిల్ల టౌన్, అక్టోబరు 16 : రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సిరిసిల్ల పట్టణం మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్‌లో క్రీడాకారులు సత్తా చాటారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ పోటీలను ప్రారంభించారు. అండర్-14 బాలుర విభాగం లాంగ్ జంప్‌లో ముత్యాల మనోజ్ ప్రథమ స్థానం, టి.అఖిల్ ద్వితీయ స్థానం, బాలికల విభాగంలో చీపిరిచెట్టి నిహారిక ప్రథమ, ఎ.కీర్తన ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్-14 బాలుర విభాగం 60 మీటర్ల పరుగు పందెంలో పస్తం అజయ్, బాలికల విభాగంలో సంజున ప్రథమ, 600 మీటర్ల పరుగు పందెంలో బాలుర విభాగంలో గోడేటి అఖిల్, బాలికల విభాగంలో పెంట సాత్విక ప్రథమ, షాట్‌పుట్ బాలుర విభాగంలో కొట్టెపెల్లి దిలీప్ ప్రథమ, పి.అజయ్ ద్వితీయ, బాలికల విభాగంలో శాస్త్రబోయిన అక్షయ ప్రథమ, నేదురి అంజన ద్వితీయ స్థానాలు సాధించారు. అండర్-16 లాంగ్ జంప్ బాలురు విభాగంలో ఆసరి మంజునాథ్ ప్రథమ, ఎ.సంతోష్ ద్వితీయ, బాలికల విభాగంలో పెద్దపిడుగు హైవిక ప్రథమ, ఎ.అక్షిత ద్వితీయ , 100 మీటర్ల బాలుర పరుగు పందెంలో సుంకే వంశీ ప్రథమ, పి.రాకేష్ ద్వితీయ, బాలికల విభాగంలో సల్ల మేఘన ప్రథమ, నాగేల్లి లక్ష్మీప్రసన్న ద్వితీయ స్థానంలో నిలిచారు. 800 మీటర్ల బాలుర విభాగంలో ఎస్.వంశీ ప్రథమ, ఎస్.కార్తికేయ ద్వితీయ, బాలికల విభాగంలో బూగ ధరణి ప్రథమ, గట్ట దీక్షత ద్వితీయ స్థానం సాధించారు. 2 కిలో మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో శ్రీపతి విక్రమ్ ప్రథమ, ఎ.రాజశేఖర్ ద్వితీయ, బాలికల విభాగంలో నాగేల్లి లక్ష్మీప్రసన్న ప్రథమ, బి.అఖిల ద్వితీయ స్థానం సాధించారు. డిస్కస్ త్రో బాలుర విభాగంలో భూక్యప్రసాద్ ప్రథమ, ఇ.రాంచరణ్ ద్వితీయ, బాలికల విభాగంలో సంకల సదా ప్రథమ స్థానంలో నిలిచింది. అండర్ - 18 బాలుర విభాగం 400 మీటర్ల పరుగు పందెంలో ఎర్ర అరవింద్ ప్రథమ, సీహెచ్ అభిలాష్ ద్వితీయ, బాలికల విభాగంలో దిబ్బల శ్రేష్ట ప్రథమ, సుచరిత ద్వితీయ స్థానం సాధించారు. 1500 మీటర్ల పరుగు పందెం బాలుర విభాగంలో చెన్నవేణి అభిలాష్ ప్రథమ, అజ్మీర సాయికుమార్ ద్వితీయ, బాలికల విభాగంలో యశస్విని ప్రథమ, సుచరిత ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్ - 20 బాలుర విభాగం 100 మీటర్ల పరుగు పందెంలో బానోతు అరవింద్ ప్రథమ, కె.తేజ ద్వితీయ, బాలికల విభాగంలో ఆరేటి దీక్షిత ప్రథమ, పి.మానస ద్వితీయ స్థానం సాధించారు. 400 మీటర్ల పరగు పందెల బాలుర విభాగంలో కురిసెంగ సుంగు ప్రథమ, బి.సురేష్ ద్వితీయ, బాలికల విభాగంలో పసుల మానస ప్రథమ, ఎం.సుదేష్ణ ద్వితీయ, 800 మీటర్ల బాలుర పరుగు పందెంలో కురుసెంగ సుంగు ప్రథమ, బి.అరవింద్ ద్వితీయ, బాలికల విభాగంలో ముత్యాల శివాని ప్రథమ, ఎ.దీక్షత ద్వితీయ స్థానం సాధించారు. జిల్లా స్థాయి అథ్టెటిక్స్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బొజ్జ చంద్రశేఖర్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22, 23, తేదీల్లో హన్మకొండలో నిర్వహించనున్న 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్స్ అథ్లెటిక్స్ పోటీలకు బాలబాలికలను పంపించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సాయికృష్ణ, వ్యాయామ ఉపాధ్యాయులు భరత్, ప్రభాకర్, గోపి, మౌనిక పాల్గొన్నారు.
Updated Date - 2022-10-17T05:45:02+05:30 IST