ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కారించాలి

ABN, First Publish Date - 2022-08-09T05:50:48+05:30

ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు సత్వరమే పరిష్కార మార్గాలను చూపాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు.

దివ్యాంగుడితో మాట్లాడుతున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, అగస్టు 8: ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులు, సమస్యలపై అధికారులు సత్వరమే పరిష్కార మార్గాలను చూపాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని అడిటోరియంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి  పాల్గొని  ప్రజలనుంచి 16 ఫిర్యాదులు, వినతి పత్రాలను స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి భాధితులకు న్యాయం చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించి  అన్నింటిని పరిష్కారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సత్యప్రసాద్‌, సిరిసిల్ల అర్డీవో శ్రీనివాసరావు, వేములవాడ అర్డీవో లీలా, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 

- దివ్యాంగుడి వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్న కలెక్టర్‌

కలెక్టరేట్‌లో జరుగుతున్న ప్రజావాణికి తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామానికి చెందిన కర్నె సంజీవ్‌ అనే దివ్యాంగుడు నడువలేని స్థితిలో రావడాన్ని చూసిన కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తన సీట్‌లోనుంచి లేచి  అతని వద్దకు వెళ్లి సమస్యను తెలుసుకున్నారు. తనకు పుట్టుకతోనేవైకల్యం ఉందని మా అమ్మనే నన్ను పోషిస్తోందని గ్రామంలో మాకు ఉన్న పాత ఇంట్లోనే ఉంటున్నామని ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోయిందని అ ఇంటిపై ప్లాస్టిక్‌ కవర్‌ను కప్పుకోని పాత గోడల మధ్య బిక్కుమంటూ  జీవనంగా సాగిస్తున్నమని మాకు డబుల్‌ బెడ్‌రూంను మంజూరు చేయాలని కోరడంతో దీంతో స్పందించిన కలెక్టర్‌ సంబంధిత అధికారికి సమస్యను పరిష్కారించాలని ఆదేశించారు


Updated Date - 2022-08-09T05:50:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising