ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోస్టల్‌ ప్రమాద బీమాను సద్వినియోగం చేసుకోవాలి

ABN, First Publish Date - 2022-10-27T00:24:09+05:30

పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.399 చెల్లిస్తే ఏడాది వరకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి రూరల్‌ , అక్టోబరు 26 : పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో రూ.399 చెల్లిస్తే ఏడాది వరకు రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కల్పిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ అన్నారు. బుధవారం మండలంలోని అందుగులపల్లిలో పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రమాద బీమాపై అవగాహనతో పాటు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈసంద ర్భంగా పోస్టల్‌ శాఖ అందించే ఈ అద్భుతమైన పథకాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ కారే శారద-శ్రీనివాస్‌ , బిపిఎం లు రమేష్‌, పృధ్వీ లతో పాటు పలువురు పాల్గొన్నారు.

ఎలిగేడు : తపాలా బీమాను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్‌ బూర్ల సంధూజ అన్నారు. గ్రామపంచాయతీలో ఆమె విలేకరులతో మాట్లాడారు. బుధవారం ఉదయం 8గంటల నుండి ఎలిగేడు గ్రామపంచాయతీలో పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారా నూతనంగా ప్రవేశపెట్టిన ఏడాదికి రూ.399ప్రీమియంతో రూ.10లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించిందని ఆ పాలసీని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 18-65ఏళ్ల వారు అర్హులని అన్నారు. పాము, తేలు కాటు, యాక్సిడెంట్‌, జారిపడి చనిపోవడం, కరెంటు షాక్‌ , శాశ్వత, పాక్షక అంగవైకల్యం సంబవించిన రూ.10లక్షల ప్రమాదబీమా వర్తిస్తుందని చెప్పారు. ఆధార్‌ కార్డు, నామిని ఆధార్‌ కార్డు, రూ. 500, మొబైల్‌ఫోన్‌, ఒక్కొక్కరికి విధిగా కొత్త సెల్‌ఫోన్‌ నెంబర్‌ అవసరమని అందుకు తగిన ఏర్పాట్లతో వచ్చి పాలసీని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ కోరుకంటి వెంకటేశ్వర్‌రావు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, జీపీ కార్యదర్శి సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-27T00:24:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising