ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదవుల్లో రాజకీయ చైతన్యం రావాలి

ABN, First Publish Date - 2022-07-07T06:09:05+05:30

యాదవుల్లో రాజకీయ చైతన్యం రావాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు.

అభివాదం చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాల్వ నర్సయ్య యాదవ్‌ వర్ధంతి సభలో వక్తలు

సుభాష్‌నగర్‌, జూలై 6: యాదవుల్లో రాజకీయ చైతన్యం రావాలని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. కరీంనగర్‌లోని రెవెన్యూగార్డెన్‌లో యాదవ సంఘం నాయకుడు కాల్వ నర్సయ్యయాదవ్‌ వర్ధంతిని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ కాల్వ నర్సయ్య లాంటి పోరాటయోదుడిని స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. కాల్వ నర్సయ్యయాదవ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం చట్ట సభల్లో యాదవులకు సముచిత స్థానం ఉన్నప్పటికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదవులకు సముచిత స్థానం కల్పించారని అన్నారు.  కాల్వ నర్సయ్య యాదవ్‌ యాదవ జాతికోసం ఎనలేని కృషిచేశారని, ఆయనను స్పూర్తిగా తీసుకొని, ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరారు. అనంతరం రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మెన్‌ దూదిమెట్ల బాలరాజు మాట్లాడుతూ  యాదవులు అన్నిరంగాల్లో రాణించి సమాజానికి స్ఫూర్తిగా నిలవాలన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం నిధులు మంజూరయ్యాయని, త్వరలోనే పంపిణీ కార్యక్రమం చేపడుతామని తెలిపారు. ఉజ్వల పార్కు సమీపంలో యాదవ విద్యార్థుల కోసం హాస్టల్‌ భవనం, పద్మనగర్‌లో యాదవ సొసైటీ భవనం, స్థలం కోసం ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ తుల ఉమ మాట్లాడుతూ యాదవుల అభ్యున్నతికి కాల్వ నర్సయ్యయాదవ్‌ అలుపెరుగని పోరాటం చేశారని అన్నారు.  కార్యక్రమంలో సంఘం నాయకుడు నాగారపు సత్యనారాయణయాదవ్‌, టీఆర్‌ఎస్‌ హుజురాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఐలేందర్‌, ఓదెల జడ్పీటీసీ గంట రాములు, బాషవేని మల్లేశంయాదవ్‌, జక్కుల నాగరాజు, బూస అంజన్న, ముఖేశ్‌, కాల్వ మల్లేశం, కొమ్మబోయిన సువీన్‌, వేల్పుల నాగరాజు, బత్తిని లక్ష్మన్‌, మంచాల రవీందర్‌, పలుమారు మల్లేశం, బీసవేని మల్లేశ్‌, మర్రి శ్రీనివాస్‌, మారం తిరుపతి, మంచాల పోచన్న పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T06:09:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising