ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రణాళికాబద్ధంగా డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌

ABN, First Publish Date - 2022-01-25T06:38:49+05:30

డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ను సిరిసిల్ల జిల్లాలో ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించా రు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిరిసిల్ల, జనవరి 24 (ఆంధ్ర జ్యోతి): డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ పైలట్‌ ప్రాజెక్ట్‌ను సిరిసిల్ల జిల్లాలో ప్రణాళికా బద్ధంగా  చేపట్టాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించా రు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, వైద్య, ఆరోగ్య సిబ్బందితో సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. జిల్లాలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌లో భాగంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఇందుకోసం గ్రామాల వారీగా ఆశా, ఏఎన్‌ఎంల సహాయంతో  బృందాలు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష లు నిర్వహించడానికి అవసరమయ్యే పరికరాలను సమకూర్చాలన్నారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి బృం దాలకు శిక్షణ ఇచ్చి సమయాత్తం చేయా లన్నారు. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, సిబ్బందిని ప్రజాప్రతినిధులను భాగ స్వామ్యం చేయాలన్నారు.  సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌ మోహన్‌రావు, డీపీవో రవీందర్‌, రాష్ట్ర పర్యవేక్షకుడు డాక్టర్‌ నందిత, మంజునాథ్‌,  ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ అనిల్‌, డీడీఎం కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-25T06:38:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising