ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రీడా ప్రాంగణాలకు స్థలాలను గుర్తించాలి

ABN, First Publish Date - 2022-07-03T06:18:21+05:30

గ్రామాల్లో, మండలాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తహసీల్దార్లను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, జూలై 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రామాల్లో, మండలాల్లో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ తహసీల్దార్లను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో భూ సేకరణపై తహసీల్దార్లు, సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి, హద్దులు నిర్ణయించి క్రీడా ప్రాంగణాలను వేగవంతంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. ధరణిపై ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌లాల్‌, ఆర్డీవో ఆనంద్‌ కుమార్‌, కలెక్టరేట్‌ ఏవో లక్ష్మారెడ్డి, ఏడీ ల్యాండ్‌ సర్వే అశోక్‌, తహసిల్దార్లు, సర్వేయర్లు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T06:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising