ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టుదల ఉంటే విజయం సాధిస్తారు

ABN, First Publish Date - 2022-05-20T05:22:24+05:30

ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉండి కష్టపడితే తప్పక విజయం సాధిస్తారని, పోలీస్‌ ఉద్యోగం అంటేనే ఒక బాధ్యత అని గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్‌ పేర్కొన్నారు.

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న ఏసీపీ గిరి ప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏసీపీ గిరి ప్రసాద్‌ 

కోల్‌సిటీ, మే 19: ఉద్యోగం సాధించాలనే పట్టుదల ఉండి కష్టపడితే తప్పక విజయం సాధిస్తారని, పోలీస్‌ ఉద్యోగం అంటేనే ఒక బాధ్యత అని గోదావరిఖని ఏసీపీ గిరి ప్రసాద్‌ పేర్కొన్నారు. గురువారం జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియం గ్రౌండ్‌లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాల ఎంపికకు ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న యువతీ యువకులనుద్దేశించి మాట్లాడారు. గతంలో ఉద్యోగాలకు కోచింగ్‌ తీసుకోవాలంటే హైదరాబాద్‌కు వెళ్లాల్సి వచ్చేదని, ఇది ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడుకునేదన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రతి రోజు గ్రౌండ్‌కు వెళ్లి ఈవెంట్లు, రాత పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. శిక్షణ శిబిరంలో పురుషులకు 1600మీటర్లు, మహిళలకు 800మీటర్ల రన్నింగ్‌ నిర్వహిస్తున్నామని, త్వరలోనే షాట్‌పుట్‌, లాంగ్‌ జంప్‌ ఈవెంట్లు కూడా ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భభంగా ఫిజికల్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్న కానిస్టేబుళ్లను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్‌ సీఐ రమేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising