ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాదయాత్రలో ప్రజలు భాగస్వాములు కావాలి

ABN, First Publish Date - 2022-08-04T05:30:00+05:30

దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్‌పార్టీ చేసిన కృషిని ఈనాటి తరానికి తెలియజేసేందుకు, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

మాట్లాడుతున్న మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 కాంగ్రెస్‌ విధానాలతోనే నేడు అభివృద్ధి ఫలాలు 

 మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌


కరీంనగర్‌ అర్బన్‌, ఆగస్టు 4: దేశాభివృద్ధి కోసం కాంగ్రెస్‌పార్టీ చేసిన కృషిని ఈనాటి తరానికి తెలియజేసేందుకు, క్షేత్రస్థాయిలో సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పాదయాత్ర చేపడుతున్నట్లు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. డీసీసీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత దేశ తొలిప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ నుంచి ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ వరకు ప్రవేశపెట్టిన పంచవర్ష ప్రణాళికలు, స్థాపించిన పరిశ్రమలు, విద్య, వైద్య సంస్థలు కల్పించిన హక్కులు, తీసుకువచ్చిన చట్టాలు, నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగాల కల్పన వంటివి ప్రజలను కలిసి వివరిస్తానన్నారు. ఆనాటి ప్రధానుల ముందుచూపుతో నేడు ప్రపంచంలో 100 కంపెనీలకు మన దేశపౌరులు సీఈఓలుగా ఉన్నారన్నారు. 2014లో గ్లోబల్స్‌ ప్రచారం ద్వారానే నరేంద్రమోదీ  హయాంలోని బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఈడీ వంటి కేంద్రసంస్థలతో దాడులు చేయించి ప్రశ్నించే గొంతులను అణచివేస్తుం దన్నారు. మిడ్‌మానేరు, అప్పర్‌మానేరు, మల్లన్నసాగర్‌, రంగనాయక సాగర్‌, కొండపోచమ్మ, గౌరవెల్లి భూనిర్వాసితుల సమస్యలను పట్టిం చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ల క్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. వేములవాడ రాజరాజేశ్వర దేవాల యం అభివృద్ధికి కేసీఆర్‌ ఏడాదికి 100 కోట్లు ఇస్తానన్న హామీ ఆరేళ ్లుగా అమలుకు నోచుకోలేదన్నారు. కరీంనగర్‌కు మెడికల్‌ కళాశాల హామీ నేటి వరకు దాని ఊసేలేదన్నారు. ఎంపీ బండి సంజయ్‌ కేవలం భాగ్యన గర్‌ టెంపుల్‌కు మాత్రమే పరిమితమయ్యారన్నారు. కేంద్రప్రభుత్వం ద్వారా కరీంనగర్‌కు మెడికల్‌ కళాశాల ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేశారో ప్రజల ముందు ఉంచాలని అన్నారు. స్వాతంత్య్రం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన, తెచ్చిన పార్టీ నాయకునిగా ప్రజలు తనను ఆశీర్వదించాలని, ఈ పాదయాత్రలో తనకు అండగా నిలవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సిటీ కాంగ్రెస్‌ అధ్యక్షులు కో మటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నాయకులు సంగీతం శ్రీనివాస్‌, సమద్‌నవాబ్‌, రహమత్‌ ముస్సేన్‌, ఎండీ తాజ్‌, పులి ఆంజనేయులు, పడాల రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు. 


 ఆగస్టు 9 నుంచి 125 కిలోమీటర్ల పాదయాత్ర


 ఈ నెల 9వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ నెల 18 వరకు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌ రెండు జిల్లాల్లో కొనసాగి ఎల్కతుర్తిలో ముగుస్తుంది. 125 కిలో మీటర్ల పాదయాత్రలో కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజక వర్గాలు, 14 మండలాలు, 70 గ్రామాల ద్వారా కొనసాగనుంది. 

Updated Date - 2022-08-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising