ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి

ABN, First Publish Date - 2022-09-10T06:50:12+05:30

గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ఆకాంక్షించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, సెప్టెంబరు 9: గణనాథుని ఆశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ఆకాంక్షించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా స్థానిక నంది చౌక్‌ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత వేదికపై నుంచి శుక్రవారం రాత్రి భక్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గణ నాథుని అనుగ్రహం ఉండాలని తాను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధి లో తలపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు సఫలీకృతం అయ్యా యన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు సహకరించిన ప్రజాప్రతి ని ధులు, అధికారులు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల స భ్యులు, నిర్వాహకులు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సంగి సత్యమ్మ, కరీంనగర్‌ డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, కమిషనర్‌ రమేష్‌, ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.  

వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల సౌకర్యార్థం దారుల్‌ ఖైర్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కూల్‌ వాటర్‌ పంపిణీ కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభించారు. పట్టణ ముస్లిం కమిటీ నేతలు ఎండీ జహంగీర్‌, అన్వర్‌ఖాన్‌, ఒకే అమ్జద్‌, షాహబాజ్‌, అలీమొద్దీన్‌  పాల్గొన్నారు.


Updated Date - 2022-09-10T06:50:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising