ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
ABN, First Publish Date - 2022-12-16T23:49:25+05:30
వర్షాలు పుష్కలంగా కురిసి, పంటలు సంవృద్ధి గా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లేలా సల్లంగా దీవించు మల్లన్న స్వామి అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన సతీమణి కొప్పుల స్నేహలతో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు.
మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ఈశ్వర్ దంపతులు
గొల్లపల్లి, డిసెంబరు 16 : వర్షాలు పుష్కలంగా కురిసి, పంటలు సంవృద్ధి గా పండి ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లేలా సల్లంగా దీవించు మల్లన్న స్వామి అంటూ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆయన సతీమణి కొప్పుల స్నేహలతో మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం గొల్లపల్లి మండలం మల్లన్న పేట శ్రీ మల్లికార్జున స్వామిని జాతర ఉత్సవాల్లో భాగంగా మంత్రి సతీసమేతంగా దర్శించుకున్నారు. మంత్రి దంపతులకు స్థానిక ప్రజా ప్రతిని ధులు, ఆలయ ఈవో విక్రమ్, టీఆర్‌ఎస్ శ్రేణులు, ఆ లయ పూజారులు కొం డూరి రాజేందర్, కొండూరి రఘువరణ్‌శర్మ వేదమం త్రోచ్ఛారణల నడుమ పూర్ణాకుంభాభిషేకంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు మంత్రి దంపతులకు ఆశీర్వచనాలు పలికి లడ్డూ ప్రసాదాలు అం దజేశారు. అనంతరం ఆలయం వెలుపల నిలువెత్తు బంగారం (బెల్లం) తులా భారం వేయించుకుని భక్తులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శం కరయ్య, వైస్ ఎంపీపీ సత్తయ్య, జడ్పీటీసీ జలేంధర్, ఏఎంసీ చైర్మన్ హన్మం డ్లు, సర్పంచ్ సిద్దంకి నరసయ్య, ఉప సర్పంచ్ భేర కిషోర్, ఎంపీటీసీ గోస్కుల రాజన్న, నాయకులు సిద్దంకి మల్లయ్య, భీమ సత్తయ్య, వెంకటి, సుధాకర్, పో చమల్లయ్య, విజయ్, ఆలయ పౌండర్ ట్రస్టీ కొండూరి శాంతయ్య, పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:49:26+05:30 IST