ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ పాదయాత్రలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

ABN, First Publish Date - 2022-12-16T23:52:43+05:30

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 16: బీజేపీ పాదయాత్రలతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీల మాదిరిగా భారతీయ జనతా పార్టీ భూస్థాపితం అవడం ఖాయమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న జీవీ రామకృష్ణారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరీంనగర్‌ టౌన్‌, డిసెంబరు 16: బీజేపీ పాదయాత్రలతో ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, టీడీపీల మాదిరిగా భారతీయ జనతా పార్టీ భూస్థాపితం అవడం ఖాయమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్‌ జీవీ రామకృష్ణారావు అన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభ అట్టర్‌ ఫ్లాఫ్‌ అయిందన్నారు. ఏ ముఖం పెట్టుకొని కరీంనగర్‌కు వచ్చావని జేపీ నడ్డాను ప్రశ్నించారు. స్వంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఓటమిపాలయ్యారని విమర్శించారు. నడ్డా, బండి దొందుదొందేనని, వారిద్దరూ అసమర్థ నాయకులేనని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ పదేపదే మాట్లాడుతున్న నడ్డా మీ చేతులో సీబీఐ, ఈడీ, ఐటీ ఉంది కదా.. ఎందుకు విచారణ జరిపించడం లేదని, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఏమిటో బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. మండుటెండల్లో కూడా నిండుకుండలను తలపించే చెరువులు, కుంటలు దర్శనమిస్తాయని అన్నారు. దేశంలోనే వరి పండించే రాష్ట్రాల్లో పంజాబ్‌ కంటే తెలంగాణ ముందంజలో ఉందని, దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పారు. సీబీఐ హైదరాబాద్‌కు వచ్చి ఎమ్మెల్సీ కవిత నుంచి వాంగ్మూలం తీసుకుందే తప్ప ఎలాంటి అభియోగాలు లేవని, అసత్యపు ఆరోపణలు ఎందుకు చేస్తారని మండిపడ్డారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వడం లేదని, చేనేత కార్మికులపై జీఎస్టీ రద్దు చేయడం లేదని, వరంగల్‌, సిరిసిల్లలో టెక్స్‌టైల్‌ పార్కులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నాలుగు బొగ్గుగనులను ప్రైవేటీకరణ ఎందుకు చేశారని, వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నడ్డా మాటల తీరు సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌... సబ్‌ కా వినాశ్‌ లాగా ఉందని మండిపడ్డారు. బండి పాదయాత్రలతో ప్రజలకు ఒరిగిందేమి లేదన్నారు. కరీంనగర్‌ బీజేపీ అడ్డా అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, 90శాతం టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులే ఉంటే మీ అడ్డా ఎలా అవుతుందన్నారు. హిందూ ధర్మరక్షణ కోసం కష్టపడుతున్నానని చెబుతున్న సంజయ్‌, ధర్మపరిరక్షణ సాధులు, సన్యాసులు, మఠాధిపతులు కృషిచేస్తారని, నీవు కూడా ఎంపీ పదవికి రాజీనామా చేసి సాధువుగా మారితే మేము కూడా మీ భక్తులవమవుతామన్నారు. సమావేశంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, సుడా డైరెక్టర్లు, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:52:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising