మోదీ పాలనపై ప్రజలకు నమ్మకం
ABN, First Publish Date - 2022-12-14T00:18:04+05:30
దేశంలో మోదీ పాలనపై ప్రజలకు నమ్మకం పెరి గిందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పెద్దపల్లిటౌన్, డిసెంబరు 13: దేశంలో మోదీ పాలనపై ప్రజలకు నమ్మకం పెరి గిందని మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక నందన గార్డెన్లో మంగళవారం నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. మోదీ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చూసిన ప్రజలు గుజ రాత్‌లో ఏడోసారి పట్టం గట్టారన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో కేవలం 20వేల ఓట్లతో ప్రభుత్వం కోల్పోయిందన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు రాజీనామా చేసినా బీజేపీ వైపే మొగ్గు చూపుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ ప్రజలు తిరుగుబాటు చేస్తారని. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు క్షీణించిపోతుందన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ గా బీజేపీ ఎదిగిందన్నారు. తెలంగాణాలో బీజేపీ జెట్ స్పీడ్‌లో ముందుకు పరుగెడు తోందన్నారు. తెలంగాణ ఆకాంక్ష నేరవేర్చుతాడని కేసీఆర్ అధికారాలు కట్టబెడితే కు టుంబ పాలన చేస్తూ కలలను సాకారం చేసుకుంటున్నాడని గుజ్జుల ఆరోపించారు. శక్తి కేంద్రాలు, బూత్ కమిటీలను బలోపేతం చేసి పార్టీని అధికారంలోకి తీసకువ చ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని సూచించారు. ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శుక్రవారం కరీంనగర్‌లో చేపట్టే సభకు జాతీయ అఽధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్న నేపథ్యంలో నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రే ణులు కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కర్రె సంజీవ్‌రెడ్డి, కేశవరా వు, పిన్నింటి రాజు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, పర్శ సమ్మయ్య, క్రాంతి కుమార్, స్వ తంత్రకుమార్, పెండ్యాల కుమార్, ఫహీం, జ్యోతి బసు, రమేష్, కలీం, శ్రీనివాస్‌రెడ్డి, వావిలాల రమేష్,కాసర్ల జనార్ధన్‌రెడ్డి, నరేష్ తదితరులున్నారు.
Updated Date - 2022-12-14T00:18:11+05:30 IST