ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెన్షనర్లను ఆదాయ పన్నునుంచి మినహాయించాలి

ABN, First Publish Date - 2022-11-24T00:42:26+05:30

కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఆదాయపు పన్నునుంచి మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జ డ్పీ, బల్దియా ఛైర్‌పర్సన్‌లు దావ వసంత, శ్రావణి పెన్షనర్‌ల తరుపున డి మాండ్‌ చేశారు.

పోస్టుకార్డులతో ఎమ్మెల్యే , పెన్షనర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌. జడ్పీ ఛైర్‌పర్సన్‌ వసంత

జగిత్యాల అర్బన్‌, నవంబరు 23: కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఆదాయపు పన్నునుంచి మినహాయింపు ఇవ్వాలని ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌, జ డ్పీ, బల్దియా ఛైర్‌పర్సన్‌లు దావ వసంత, శ్రావణి పెన్షనర్‌ల తరుపున డి మాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే, జడ్పీ క్యాంప్‌ కార్యాలయాలతో పాటు, బల్దియా చైర్‌పర్సన్‌ నివాసంలో ప్రజాప్రతినిధులను తెలంగాణ పె న్షనర్స్‌ సెంట్రల్‌ అసోసియేషన్‌ బాధ్యులు కలిసి, వారిచే పోస్టుకార్డు ద్వారా ఆ దాయపు పన్ను మినహాయించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడు తూ పదవీ విరమణ తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చే గౌరవ భృతియే పె న్షన్‌ అని, అలాంటి భృతిపై ఆదాయపు పన్ను విధించడం అన్యాయం అన్నా రు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, అర్వింద్‌లతో పాటు వివిధ పదవుల్లో ఉ న్న బీజేపీ నేతలు సత్వరం ఈ అంశంపై స్పందించాలని, ఆదాయపు పన్ను మినహాయింపునకు కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సం ఘ అధ్యక్షుడు హరి అశోక్‌కుమార్‌, ప్రధానకార్యదర్శి బొల్లం విజయ్‌కుమార్‌, సంఘ సభ్యులు విశ్వనాథం, ప్రకాష్‌, యాకుబ్‌, అశోక్‌రావు, కరుణ, సత్యనారా యణ, రాజేశ్వర్‌, శివానందం, గంగాధర్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-11-24T00:42:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising