ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అర్హులందరికీ పింఛన్‌ మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2022-09-29T05:38:36+05:30

అర్హులందరికీ పింఛన్‌ మంజూరు చేయాలని, కొత్త పెన్షన్‌ దారులకు 2019 సంవత్సరం నుంచి చెల్లింపులు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్‌ చేశారు.

వినతి పత్రం అందజేస్తున్న విజయరమణారావు తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు

సుల్తానాబాద్‌, సెప్టెంబరు, 28: అర్హులందరికీ పింఛన్‌ మంజూరు చేయాలని, కొత్త పెన్షన్‌ దారులకు  2019 సంవత్సరం నుంచి చెల్లింపులు చేయాలని మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్‌ చేశారు. సుల్తానాబాద్‌లో ఆయన బుధవారం కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మండల పరిషత్‌ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. అనంతరం విజయరమణారావు విలేకర్లతో మాట్లాడుతు గత నాలుగేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌ పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టోలో 57 ఏళ్ల వయసు ఉన్న వారికి పెన్షన్‌ మంజూరు చేస్తామని పేర్కోందని ఈ మేరకు ధరఖాస్తులు చేసుకోవాలని కేసీఆర్‌ చెప్పడంతో వేలాది మంది పెన్షన్‌ కోసం దరఖాస్థులు చేసుకున్నారని కానీ నాలుగేళ్ల తర్వాత నామ మాత్రంగా కొందరికి మాత్రమే మంజూరు చేసి కేవలం కార్డుల పంపిణీ కార్యక్రమం గ్రామాల్లో చేపట్టారని అన్నారు. ఆర్హులైన వారందిరికీ వెంటనే పెన్షన్‌  మంజూరు చేయాలని, నాలుగేళ్ల నుంచి చెల్లింపులు జరుపాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌  నాయకులు అంతటి అన్నయ్య గౌడ్‌,  ఊట్ల వరప్రసాద్‌, మినుపాల ప్రకాష్‌ రావు, దామోదర్‌ రావు,మండల పార్టీ అధ్యక్షులు చిలుక సతీష్‌,పట్టణ అద్యక్షులు అబ్బయ్య గౌడ్‌, నాయకులు గొట్టం మల్లయ్య, పన్నాల రాములు, రాజలింగం, చింతల రాజు, తిరుపతి, కుమార్‌ కిషోర్‌, పోచాలు, చక్రదర్‌, రవి, శ్రీనివాస్‌,అనిల్‌, పర్శరాములు తదతరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-29T05:38:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising