ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్తీ దవాఖానలో పెండింగ్‌ పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2022-08-19T06:07:42+05:30

సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంతోపాటు ఈ నెల 21న మొక్కలను నాటించి ప్లాంటేషన్‌ను పూర్తి చేయాలని మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.

రాజీవ్‌నగర్‌లో బస్తీ దవాఖానను పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల రూరల్‌, ఆగస్టు 18: సిరిసిల్ల అర్భన్‌ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంతోపాటు ఈ నెల 21న మొక్కలను నాటించి ప్లాంటేషన్‌ను పూర్తి చేయాలని   మున్సిపల్‌ అధికారులను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. రాజీవ్‌నగర్‌లో  13 లక్షల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖాన ఆవరణంలో మొత్తం మొక్కలను నాటించడంతోపాటు దవాఖానలో అన్ని సెక్షన్‌లకు అవసరమైన సామగ్రిని వెంటనే సమాకుర్చుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రేయిలింగ్‌ వర్క్‌ పనులను పూర్తి చేయాలన్నారు. దవాఖానతో పాటు మరుగుదోడ్ల వద్ద మెట్లను నిర్మించాలన్నారు. పట్టణ పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించాలనే లక్ష్యంతో సిరిసిల్ల మున్సిపల్‌ ఆధ్వర్యంలో బస్తీ దవాఖాను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-19T06:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising