ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలి

ABN, First Publish Date - 2022-12-15T00:44:15+05:30

సెస్‌ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ నాయకులు సమష్టిగా కృషి చేయాలని వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ కోరారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌

వేములవాడ, డిసెంబరు 14: సెస్‌ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ నాయకులు సమష్టిగా కృషి చేయాలని వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్‌ కోరారు. సెస్‌ ఎన్నికల సందర్భంగా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని ఆరు మండలాల డైరెక్టర్ల స్థానాలకు బీఆర్‌ఎస్‌ బలపరుస్తున్న అభ్యర్థుల వివరాలను బుధవారం ఆయన తన నివాసంలో వెల్లడించారు. వేములవాడ-1 స్థానం నుంచి నామల ఉమ లక్ష్మీరాజం, వేములవాడ-2 స్థానం నుంచి రేగులపాటి హరిచరణ్‌రావు, వేములవాడ రూరల్‌ స్థానం నుంచి ఆకుల దేవరాజం, కోనరావుపేట నుంచి దేవరకొండ తిరుపతి, చందుర్తి నుంచి పొన్నాల శ్రీనివాసరావు, రుద్రంగి నుంచి ఆకుల గంగారాం అభ్యర్థిత్వానికి బీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు, ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నాణ్యమైన ఉచిత విద్యుత్‌, మౌలి క వసతుల కల్పన, రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోలు వంటివాటిపై విశేషంగా ప్రచారం చేసి పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ నాల్యకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, బీఆర్‌ఎస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T00:44:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising