ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పల్లె ప్రగతి’ని ప్రణాళికాబద్ధంగా అమలుచేయాలి

ABN, First Publish Date - 2022-06-16T05:45:10+05:30

గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా పల్లెప్రగతి కార్యక్ర మాలను అమలు చేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అధికారులకు సూచనలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ 

పాలకుర్తి, జూన్‌ 15 : గ్రామాల్లో ప్రణాళికాబద్ధంగా పల్లెప్రగతి కార్యక్ర మాలను అమలు చేయాలని కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మండలంలోని పుట్నూర్‌, జీడి నగర్‌, కన్నాల గ్రామాల్లో జరుగుతున్న పల్లెప్రగతి పనులను కలెక్టర్‌ పరి శీలించారు. జీడినగర్‌ గ్రామంలో మన ఊరు-మన బడి కింద ఎంపికైన ఎంపీపీఎస్‌ పాఠశాలను సందర్శించి ఈనెలాఖరు వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. హరితహారంలో నాటిన మొక్కలను పరిశీలించి వాటి సంరక్షణకు అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరుచుకోవాలని, వానాకాలం దృష్ట్యా మురుగు కాలు వల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్‌ అధికారు లను ఆదేశించారు. కన్నాల, పుట్నూర్‌ గ్రామాలలోని అమృత్‌ సరోవర్‌ పథకం కింద గ్రామంలో ఎంపికచేసిన చెరువు పూడికతీత పనులు జులై చివరినాటికి పూర్తిచేయాలని అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పుట్నూ ర్‌లో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనం, నర్సరీలను కలెక్టర్‌ సందర్శించా రు. కన్నాల, జీడినగర్‌ గ్రామాలలో క్రీడాప్రాంగణాలను ఈ వారంలోగా పూర్తిచేయాలని ఈనెలలోపు అన్ని గ్రామాల్లో అన్ని సుందరీకరణ పను లు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎం పీపీ వ్యాళ్ళ అనసూర్య రాంరెడ్డి, జీడినగర్‌ సర్పంచ్‌ సూర సమ్మయ్య, కన్నాల ఎంపీటీసీ ఎంఏ అతిక్‌, ఎంపీడివో షబ్బీర్‌పాషా, తహసీల్దార్‌ వరంధన్‌, పంచాయతీరాజ్‌ ఏఈ శ్రీనివాస్‌, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-16T05:45:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising