ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనింగ్‌ స్టాఫ్‌పై పనిభారం మోపుతున్న యాజమాన్యం

ABN, First Publish Date - 2022-05-16T06:31:15+05:30

సింగరేణిలో పని చేస్తున్న మైనింగ్‌ స్టాఫ్‌, ట్రేడ్‌మెన్‌లపై యాజమాన్యం పనిభారం మోపుతోందని ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్‌ కార్యదర్శి మడ్డి ఎల్లయ్య ఆరోపించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఏఐటీయూసీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆరెల్లి పోషం

గోదావరిఖని, మే 15: సింగరేణిలో పని చేస్తున్న మైనింగ్‌ స్టాఫ్‌, ట్రేడ్‌మెన్‌లపై యాజమాన్యం పనిభారం మోపుతోందని ఏఐటీయూసీ కేంద్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆరెల్లి పోషం, బ్రాంచ్‌ కార్యదర్శి మడ్డి ఎల్లయ్య ఆరోపించారు. ఆదివారం భాస్కర్‌ భవన్‌లోఓ జరిగిన మైనింగ్‌ స్టాఫ్‌ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న ట్రేడ్స్‌మెన్‌ల సమస్యలపై నిర్వహించనున్న సమావేశాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణిలో 9సంవత్సరాలుగా గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ ఏనాడు కూడా మైనింగ్‌ స్టాఫ్‌, ట్రేడ్‌మెన్‌ల సమస్యలు పరిష్కరించుకోవడం లేదని, సింగరేణిలో 60డిమాండ్లు సాధించామని గొప్పలు చెప్పుకుంటున్న టీబీజీకేఎస్‌ 60డిమాండ్లు ఏం సాధించారో బహిర్గతం చేయాలని చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తాడిచర్ల మైన్‌ను సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్‌ వారికి అప్పగించారని, సింగరేణిలో ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుంది టీఆర్‌ఎస్‌ యేనని ఆయన విమర్శించారు. గుర్తింపు సంఘం నాయకులు కేవలం  పైరవీలకు మాత్రమే పరిమితమయ్యారని, కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు రంగు శ్రీనివాస్‌, బోగె సతీష్‌, పర్లపల్లి రామస్వామి, అబూబాకర్‌, మానాల శ్రీనివాస్‌, తొడుపునూరి రమేష్‌, శ్యామ్‌కుమార్‌, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-16T06:31:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising