ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వాన్ని ప్రజలకు చేరువ చేసిన ఎన్టీఆర్‌

ABN, First Publish Date - 2022-05-29T05:33:11+05:30

ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసిన మహానాయకుడు ఎన్‌టీఆర్‌ అని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన మహనీయుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు.

ఎన్‌టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే చందర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌

- ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

గోదావరిఖని, మే 28: ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేసిన మహానాయకుడు ఎన్‌టీఆర్‌ అని, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన మహనీయుడని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ పేర్కొన్నారు. శనివారం గోదావరిఖని చౌరస్తాలో ఎన్‌టీఆర్‌ శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమా న్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కరణం, పట్వారి వ్యవస్థను రద్దు చేసి మండలాలను ఏర్పాటు చేసి ప్రభుత్వ పాలనను ప్రజలకు చేరువ చేశారన్నారు. పేద ప్రజలు ఆకలితో అలమటించకుండా రూ.2లకే కిలో బియ్యం ప్రవేశపె ట్టి పేదల ఆకలి తీర్చారన్నారు. గోదావరినది పై వం తెనకు శ్రీకారం చుట్టి ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబా ద్‌ల మధ్య రవాణాను మెరుగుపర్చారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఘ నత ఎన్‌టీఆర్‌దేనని, ఆయనకు భారతరత్న ఇవ్వాలన్నారు. అభిమానుల కోరిక మేరకు రామగుండంలో అనువైన స్థలంలో ఎన్‌టీఆర్‌ విగ్రహ ప్రతిష్ఠాపనకు సహకారం అందిస్తానన్నారు. కార్యక్రమంలో మేయర్‌ బంగి అనీల్‌ కుమార్‌, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు కన్నూరి సతీష్‌కుమార్‌, కొ మ్ము వేణు, బాలరాజ్‌కుమార్‌, సాగంటి శంకర్‌, కో ఆ ప్షన్‌ సభ్యులు బుచ్చిరెడ్డి, సర్పంచ్‌ ధర్మాజి కృష్ణ, కాం గ్రెస్‌ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్‌, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, మలెం కిరణ్‌, మాలెం మధు, నారాయణదాసు మారుతి, మేడి సదయ్య, సన్ని, నీరటి శ్రీనివాస్‌, ఉల్లంగుల రమేష్‌, అఫిజ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T05:33:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising