మహిళల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ABN, First Publish Date - 2022-03-05T06:44:09+05:30
మహిళల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, మార్చి 4 :మహిళల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని టీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో ఈ నెల 6 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలపై పట్టణ ముఖ్య కార్యకర్తలతో బల్దియా చైర్ పర్సన్ బోగ శ్రావణితో కలిసి ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు వే డుకలను మూడు రోజుల పాటు మహిళా బంధు కేసీ ఆర్ పేరుతో వివిధ కార్యక్రమాలు చేబడుతున్నట్లు వివ రించారు. ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా నిత్యం 5 లక్షల మంది ఆడబిడ్డలకు గుడ్లు, ఆహారం అందిస్తున్నామని, 10 లక్షల మందికి కేసీఆర్ కిట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లబ్ధి పొందారన్నారు. అనంతరం వే డుకలను నిర్వహించేందుకు అనువైన స్థలాలను పరి శీలించారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్, కౌన్సిలర్లు, మహిళా నాయకులు ఉన్నారు.
Updated Date - 2022-03-05T06:44:09+05:30 IST