ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త పింఛన్లు మంజూరు చేయాలి

ABN, First Publish Date - 2022-08-17T05:35:13+05:30

సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు.

గంభీర్‌పూర్‌లో మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, ఆగస్టు 16 : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ ఆరోపించారు. మంగళవారం మండలంలోని గంభీర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో కూడా 15 ఆగస్టు నాడు 57 ఏళ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తున్నామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తానని మూడున్నరేళ్లుగా రైతులతో చెలగాటమాడుతున్నారన్నారు. రైతాంగం వడ్డీలు చెల్లించలేక జీవన్మరణ సమస్యగా బతుకుతున్నారన్నారు. పల్లెల్లో వ్యాధులు ప్ర బలుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిన చందాన వ్యవహరించడం శోచనీయమన్నారు. ప్రభుత్వం శానిటేషన్‌ కోసం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యవర్గ సభ్యులు తొట్ల అంజయ్య, మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, పులి హరిప్రసాద్‌, ఉరుమల్ల కృష్ణమాచారి, కల్లెడ గంగాధర్‌ ఉన్నారు. 

Updated Date - 2022-08-17T05:35:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising