బైపాస్ రోడ్డు నిర్మాణ పనుల్లో అధికారుల నిర్లక్ష్యం
ABN, First Publish Date - 2022-10-17T05:54:56+05:30
జిల్లా కేంద్రంలో రాజీవ్ బైపాస్ నిర్మా ణ పనుల్లో అధికారుల నిర్లక్షమే పాలనా యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు.
ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి
జగిత్యాల అర్బన్, అక్టోబరు 16: జిల్లా కేంద్రంలో రాజీవ్ బైపాస్ నిర్మా ణ పనుల్లో అధికారుల నిర్లక్షమే పాలనా యంత్రాంగం పనితీరుకు అద్దం పడుతోందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని స్ధానిక ఇం దిరా భవన్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ యావర్ రోడ్‌పై భారం తగ్గించేందుకు పట్టణాన్ని ఆనుకొని రాజీవ్ బైపాస్ రోడ్డు నిర్మాణం చేశామన్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం తో యావర్‌రోడ్డుపై 25శాతం రవాణా భారం తగ్గేలా ఈ రోడ్డు నిర్మాణం చేపట్టామన్నారు. దశాబ్ద కాలం గడిచినా బైపాస్ రోడ్డుపై ఐదేళ్ల కొకసారి బీటీ రెన్యూవల్ చేయాల్సి ఉండగా, నేటికీ చేయకపోవడం దురదృష్టకరం అన్నారు. గడిచిన మూడు, నాలుగేళ్లలో రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు పడి, ప్రమాదాలు జరుగుతున్నాయని, ముఖ్యంగా వాహనదారులు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కుంటున్నార న్నారు. అయితే బీటీ రెన్యూవల్ ఎందుకు చేయ డం లేదని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయట పడడం తనకు ఆశ్చ ర్యం కలిగించిందని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 2018లో అయిన అగ్రిమెంట్ లో నాలుగు నెలల్లో పూర్తి కావాలని వివరంగా ఉండగా, నాలుగేళ్లు గడి చినా నేటికీ బీటీ రెన్యూవల్ చేయకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా పట్టణ మున్సిపాలీటీ, పబ్లిక్ హెల్త్ అధికా రులు ఏం చేస్తున్నారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. నిర్లక్ష్యానికి, జాప్యానికి ఎ వరిని బాధ్యులను చేస్తారని ప్రశ్నించిన ఆయన ప్రత్యేక అధికారిని నియ మించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నిర్లక్ష్యంతో అయిన పాలన యంత్రాంగం మేల్కోవాలని, తక్షణమే స్పందించి నాణ్యతా ప్రమా ణాలతో పనులు పూర్తయ్యేలా చూడాలని ఆయన కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ నిర్లక్ష్యంపై ముందుగా కలెక్టర్‌కు లేఖ రాయడంతో పాటుగా, ట్విట్టర్ మంత్రి కేటీఆర్‌కు పాలన పరిస్థితిని వివరిస్తానన్నారు.
Updated Date - 2022-10-17T05:54:56+05:30 IST