ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్మికులకు అన్యాయం చేసిన జాతీయ సంఘాలు

ABN, First Publish Date - 2022-05-18T05:21:24+05:30

వేజ్‌బోర్డు ద్వారా కార్మికులకు హక్కులను సాధించకుండా అవగాహన లేని ఒప్పందాలు చేసుకుని అన్యాయం చేసినట్టు టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య ఆరోపించారు.

మాట్లాడుతున్న కెంగర్ల మల్లయ్య
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య

యైుటింక్లయిన్‌కాలనీ, మే 17: వేజ్‌బోర్డు ద్వారా కార్మికులకు హక్కులను సాధించకుండా అవగాహన లేని ఒప్పందాలు చేసుకుని అన్యాయం చేసినట్టు టీబీజీకేఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెంగర్ల మల్లయ్య ఆరోపించారు. మంగళవారం ఆర్జీ-2 వర్క్‌షాప్‌లో జరిగిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. రిటైర్డ్‌ కార్మికుల వైద్య సదుపాయానికి ఒప్పందం చేసుకున్న సీపీఆర్‌ఎంఎస్‌ స్కీం కింద 40 వేల రికవరీ చేసి 8లక్షల వరకు వైద్య ఖర్చులకు చెల్లించేలా ఒప్పం దం చేసుకున్నారన్నారు. అదే అధికారులకు నయా పైసా చెల్లించకుండా 25 లక్షల వరకు వైద్య ఖర్చులకు చెల్లించే అవకాశం ఉన్నదని తెలిపారు. అండర్‌ గ్రౌండ్‌ అలవెన్స్‌ తగ్గించడంతో పాటు పెన్షన్‌ రికవరీ ఏడు శాతం చేయడం, ధరల పెరుగుదలకు అనుగూణంగా డీఏ పెరగకున్నా జాతీయ సంఘాలు పోరాడలేదని పేర్కొన్నారు. కార్మికులకు తీవ్రం నష్టం చేసే సంఘాలు గనుల మీద ప్రచారానికి వస్తే కార్మికులు నిలదీయాలని మల్లయ్య పిలుపు నిచ్చారు. ఆర్జీ-2 వైస్‌ప్రెసిడెంట్‌ అయిలి శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన గేట్‌ మీటింగ్‌లో దేవ వెంకటేశం, సత్యనారాయణరెడ్డి, ఎట్టం కృష్ణ, ప్రభాకర్‌రెడ్డి, ఐ సత్యం, దశరథం, సురేందర్‌, మల్లేశ్వరరావు, విజయసారథి, రవీందర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-18T05:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising