ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజన్న క్షేత్రంలో నేడు ముక్కోటి ఏకాదశి

ABN, First Publish Date - 2022-01-13T05:58:36+05:30

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది.

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ముస్తాబైన రాజన్న క్షేత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 వేములవాడ, డిసెంబరు 12 :  వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ముక్కోటి ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా  గురువారం తెల్లవారుజామున 3-00 గంటలకు మంగళవాయిద్యములు, 3-10 గంటల నుంచి సుప్రభాత సేవ, 3-35 గంటల నుంచి సుప్రభాత దర్శనం, 3-50 గంటల నుంచి ప్రాతఃకాల పూజ, 5-00 నుంచి స్వామివారల పల్లకీసేవ నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 5.10 గంటల నుంచి పార్వతీరాజరాజేశ్వరస్వామివారు,  లక్ష్మీఅనంతపద్మనాభస్వామివారలు పల్లకీసేవపై ఉత్తర ద్వారం వద్ద దర్శనమిస్తారు. అనంతరం తూర్పు భాగంలోని రాజగోపురం వద్ద ముక్కోటి ఏకాదశి విశిష్టత, ప్రవచనము, మహా హారతి, ప్రసాద వితరణ వంటి కార్యక్రమాలు ఉంటాయి.  కొవిడ్‌ నిబంధల మేరకు భక్తులను ఉత్సవాలకు అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గర్భాలయంలో అభిషేకం, అన్నపూజ రద్దు చేశామని పేర్కొన్నారు.  

Updated Date - 2022-01-13T05:58:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising