ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్టీయూతోనే సమస్యల పరిష్కారం

ABN, First Publish Date - 2022-09-28T05:28:23+05:30

ఉపాధ్యాయుల సమస్యలు పీఆర్టీయూతోనే సాధ్యమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 27: ఉపాధ్యాయుల సమస్యలు పీఆర్టీయూతోనే సాధ్యమని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మంగళవారం కరీంనగర్‌ ప్రెస్‌భవన్‌లో నిర్వహించిన పీఆర్టీయూ జిల్లా శాఖ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన ముఖ్య అథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్‌రెడ్డి మాట్లాడుతూ 317 జీవో ద్వారా సమస్యలు ఏర్పడ్డాయన్నారు. వితంతువులు, మెడికల్‌ గ్రౌండ్‌ ద్వారా సీనియర్‌ జూనియర్‌ ఉపాధ్యాయుల సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయన్నారు. నవంబరు, డిసెంబరు నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతలు ఉంటాయని, పండితుల అప్‌గ్రేడేషన్‌ పూర్తి అవుతాయని తెలిపారు. పాఠశాలల్లో స్కావెంజర్స్‌ నియమకం కోసం ముఖ్యమంత్రిని ఒప్పిస్తామని అన్నారు. 13 జిల్లాలోని స్పౌస్‌ సమస్యలను సాధ్యమైనంతవరకు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్‌, జిల్లా అధ్యక్షుడు ముస్కు తిరుపతిరెడ్డి, ప్రధానకార్యదర్శి మర్రి జైపాల్‌రెడ్డి, జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు ఎల్‌ వెంకటేశ్వర్‌రావు, ఎ మోహన్‌, మహిళా అసోసియేట్‌ సునీత, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు డి బాల్‌రెడ్డి, సీహెచ్‌ శ్రీకాంత్‌రావు, టి వెంకట్‌రాజం, ఎస్‌ మహేశ్‌, ఎల్‌ ఆగన్న, యు జలపతి, ఎం తిరుపతి, ఇ లింగారెడ్డి, ఎస్‌ సత్యనారాయణ, ఎస్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎం రాంరెడ్డి, సీహెచ్‌ వాణి పాల్గొన్నారు.

Updated Date - 2022-09-28T05:28:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising