ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ అంటే బక్వాస్, బద్మాష్, జూట పార్టీ: ఎంపీ వెంకటేశ్ నేత

ABN, First Publish Date - 2022-03-23T16:14:48+05:30

పెద్దపల్లి: టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్దపల్లి: టీఆర్ఎస్ ఎంపీ వెంకటేశ్ నేత బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్లమెంట్ సాక్షిగా గిరిజన బిల్లుపై అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు. బీజేపీ అంటే బక్వాస్, బద్మాష్, జూట పార్టీ అని అన్నారు. దళితులు, గిరిజలు, ఉద్యోగులు, ప్రజలందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సిగ్గుంటే బండి సంజయ్, అరవింద్ స్పందించాలన్నారు. గిరిజన రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని 2017లోనే పంపడం జరిగిందన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా దృవీకరించారని, ఇదే అంశాన్ని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రధాని మోదీతో మాట్లాడారని తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలు అమలు చేస్తున్నారని వెంకటేశ్ నేత అన్నారు. వరి ధాన్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర రైతాంగ సమస్యలు బీజేపీ ఎంపీలకు పట్టవా..? అని ప్రశ్నించారు. కల్లాలకు పోయి రైతులను గందరగోళపరచిన తెలంగాణ బీజేపీ ఎంపీలు.. ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి, ప్రధానితో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. రైతుల పంటను కొనుగోలు చేసేవరకు నిలదీస్తూనే ఉంటామన్నారు. తెలంగాణ భారత దేశంలో భాగం కాదా?.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధానం ఎందుకని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం  రైతుల ధాన్యం కొనుగోలు చేసేవరకు వదిలే ప్రసక్తేలేదని ఎంపీ వెంకటేష్ నేత స్పష్టం చేశారు.

Updated Date - 2022-03-23T16:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising