ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ, ఎస్టీలపై ఎక్కువ కేసులు

ABN, First Publish Date - 2022-01-21T06:45:22+05:30

బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ, ఎస్టీలపై అత్యధి కంగా కేసులు నమోదయ్యాయని సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొ న్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ఈశ్వర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- విలేకరుల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌

పెద్దపల్లిటౌన్‌, జనవరి 20: బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఎస్సీ, ఎస్టీలపై అత్యధి కంగా కేసులు నమోదయ్యాయని సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొ న్నారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహ ర్‌రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. బండి సంజయ్‌, జితేందర్‌రెడ్డి, ప్రేమేం దర్‌రెడ్డిలు రాష్ట్రంలోని అన్ని ఎస్సీ అసెం బ్లీ నియోజక వర్గాలను టార్గెట్‌ చేసి గెలుచుకుంటామని స్థానిక ఎస్సీ నాయ కులను భయభ్రాంతులకు గురిచేస్తున్నార న్నారు. ఏడేళ్ళ కేంద్ర ప్రభుత్వ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మోదీ ప్రభుత్వం ఏం చేసిందో ప్రజలకు తెలియాలని సూచించారు. ఇందుకోసం వేసిన కమిటీలో ఎస్సీలే లేరని, అందరు రెడ్డిలే ఉన్నారన్నారు. ఆయా వర్గాల కోసం ఏనాడైనా పోరాడి సాధించిందేంటో వివరించాలన్నారు. వర్ణ వ్య వస్థను ప్రొత్సహించే బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే నైతికత లేదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీలపై హత్యలు, అత్యాచారాలు, దాడులు పెరిగాయని మంత్రి ఆరోపించారు. ఎస్సీలపై 45961, ఎస్టీ లపై 8272 కేసులు నమోదయ్యాయ న్నారు. బీజేపీ పాలిం చే రాష్ర్టాల్లోనే పెద్ద మొత్తంలో కేసులు నమోదయ్యాయని ఆరోపించారు. ఇంత నీచ రాజకీయ చరిత్ర ఉన్న బీజేపీ నాయకులు ఎస్సీ స్థానాల్లో ఎలా గెలుస్తార ని ప్రశ్నించారు. బీజేపీ పాలన పట్ల ప్రజలకు సంతృప్తి లేద ని, ఆయా వర్గాల అభివృద్ధి కోసం ఇప్పటివరకు ఎజెండానే లేదన్నారు. కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టే ఆ పార్టీ సిద్ధాంతాలపై ప్రజలు తిరుగుబాటు జెండా ఎగురవేయడం ఖాయమ న్నారు. బీజేపీ పాలనలో ఏ వర్గానికి మేలు చేయకపోవ డమే కాకుండా దేశాన్ని నాశనంచేశారని ఆయన ఆవే దన వ్యక్తంచేశారు. ఏడాది కాలంగా రైతుల హక్కుల చేసిన పోరాటంలో 800మందిని రైతులు బలితీసుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘాన్ని గుప్పిట్లో పెట్టు కొని న్యాయ వ్యవస్థలో జోక్యం చేసుకొని ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు హోదా లను కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా దళితబంధు అమలుచే స్తున్నామన్నారు. దళిత వర్గాల కోసం 280 రెసిడెన్షియల్‌ పాఠశాలలు నడుపుతున్నామని, విదేశాల్లో విద్య కోసం 20 లక్షల రూపాయల స్కాలర్‌షిప్‌ అందిస్తున్నామన్నారు. అధికార కోసం నోటికి వచ్చింది మాట్లాడితే ప్రజల్లో విశ్వా సం కోల్పోతారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, బండారి శ్రీనివాస్‌, మహ్మద్‌ జావీద్‌, మోబిన్‌, పైడ రవి, తదితరులున్నారు. 

Updated Date - 2022-01-21T06:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising