ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కల్వకుంట్ల

ABN, First Publish Date - 2022-01-27T05:56:15+05:30

జిల్లా గులాబీ పార్టీ బాస్‌గా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు నియామకం అయ్యారు.

కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-ఉత్తర్వులు జారీ చేసిన సీఎం కేసీఆర్‌

జగిత్యాల, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా గులాబీ పార్టీ బాస్‌గా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు నియామకం అయ్యారు. ఈమేరకు బుధవారం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్ష పదవి భర్తీని ఎట్టకేలకు పార్టీ అధిష్టానం పూర్తి చేసింది. విద్యాసాగర్‌ రావును జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా నియామ కం చేయడాన్ని స్వాగతిస్తూ కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీఆర్‌ ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేశా రు. విద్యాసాగర్‌రావు బీఏ వరకు విద్యాబ్యాసం చేశారు. వెలమ సా మాజిక వర్గానికి చెందిన విద్యాసాగర్‌ రావుకు భార్య సరోజ, కూతురు డాక్టర్‌ సమత, కుమారుడు డాక్టర్‌ సంజయ్‌లున్నారు. మెట్‌పల్లి సివిల్‌ కాంట్రాక్టర్‌గా వృత్తిని చేసుకుంటున్న విద్యాసాగర్‌ రావు తొలిసారిగా 1997లో టీడీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. మెట్‌పల్లి టీడీపీ నియోకజవర్గ ఇన్‌చార్జిగా పనిచేశారు. 1998 మెట్‌పల్లి అసెంబ్లీ ఉప ఎ న్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2000 సం వత్సరం నుంచి 2004 వరకు కరీంనగర్‌ ఆర్టీసి జోనల్‌ చైర్మన్‌గా, ఇ బ్రహీంపట్నం జడ్పీటీసీగా, జడ్పీ టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా పనిచేశారు. 2004లో మెట్‌పల్లి స్వతంత్రఅభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ రాజీనామా చేసి 2008లో టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో జరిగిన అ సెంబ్లీ నియోజకవర్గాల్లో భాగంగా జిల్లాలో కొత్తగా ఏర్పడ్డ కోరుట్ల అ సెంబ్లీ నియోజకవర్గం నుంచి 2009లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చే సి తొలిసారిగా ఎమ్మెల్యే పదవిని అలంకరించారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో కోరుట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెండో సారి విజ యం సాధించారు. 2014 ఎన్నికల్లో కోరుట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి హ్యాట్రిక్‌ విజయం కైవసం చేసుకున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వ హా మీల కమిటీ చైర్మన్‌గా వ్యవహరించారు. 2018 సంవత్సరంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి 4వ పర్యాయం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో శాసన సభ పబ్లిక్‌ అండ్‌ టేకింగ్‌ కమిటీ సభ్యునిగా నియామకం అయ్యారు. మెట్‌పల్లి ఖా దీ గ్రామోద్యోగ్‌ ప్రతిష్టాన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2021లో తిరు మల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా నియామకమై బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్‌రావు టీఆర్‌ఎస్‌ జగిత్యాల జిల్లా అధ్యక్షుడిగా మరో పదవిని కైవసం చేసుకున్నారు.  

Updated Date - 2022-01-27T05:56:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising