ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వబ్రాహ్మణులకు మంత్రి కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలి

ABN, First Publish Date - 2022-07-03T05:56:52+05:30

విశ్వబ్రాహ్మణ జాతిని కించపర్చేలా మా ట్లాడిన మంత్రి కేటీఆర్‌ యావత్‌ విశ్వబ్రాహ్మణులకు భేషరతుగా క్షమా పణ చెప్పాలని జగిత్యాల స్వర్ణకార సంఘం కులస్థులు డిమాండ్‌ చేశారు.

ధర్నా చేస్తున్న స్వర్ణకార సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జగిత్యాల స్వర్ణకార సంఘం డిమాండ్‌ 

స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

జగిత్యాల అర్బన్‌, జూలై 2: విశ్వబ్రాహ్మణ జాతిని కించపర్చేలా మా ట్లాడిన మంత్రి కేటీఆర్‌ యావత్‌ విశ్వబ్రాహ్మణులకు భేషరతుగా క్షమా పణ చెప్పాలని జగిత్యాల స్వర్ణకార సంఘం కులస్థులు డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని పురాణిపేట స్వర్ణకార సంఘం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన వారు స్థానిక తహసీల్‌ చౌరస్తాలో నిరసన ధర్నా నిర్వహించి కేటీ ఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి, కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు రంగు రాజయ్య, పట్టణ అధ్యక్షుడు తొగిడి గం గాధర్‌ మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది విశ్వబ్రాహ్మణ జాతే అన్నారు. అలాంటి జాతిని అవమాన పర్చేలా మంత్రి కేటీఆర్‌ మాట్లాడడం ఆయన అహంకారానికి నిదర్శనం అన్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్‌ విశ్వబ్రాహ్మణులకు భేషరతుగా బ హిరంగ క్షమాపణ చెప్పాలని లేనట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా తమ ఉద్య మాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్వ ర్ణకార సంఘ నాయకులు ఎనుగంటి రవి కుమార్‌, తుమ్మనపల్లి సంతోష్‌, కట్ట విజయ్‌ కుమార్‌, అజయ్‌, కట్ట శివకుమార్‌, గుగ్గిల్ల సత్యనారాయణ, రజన్‌కుమార్‌, మాధవాచారి, రాజేష్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-07-03T05:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising